Sanitation Workers: పారిశుధ్య కార్మికుల నెల జీతం రూ. 8 లక్షలా!.. అని ఆశ్చర్యపోతున్నారా.. మరీ అంతలా ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే.. ఇది కనీస జీతం మాత్రమే.. క్లీనింగ్ పని చేస్తూ నెలకు 8 లక్షలకు పైనే సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ, అది మన ఇండియాలో మాత్రం కాదులెండి. మరి ఎక్కడా? అంటారా.. కంగారుల దేశం ఆస్ట్రేలియాలో.. ఈ దేశంలో పారిశుధ్య కార్మికుల కొరత విపరీతంగా ఉంది. క్లీనింగ్ పని చేయటానికి ఎవరూ రావటం లేదు. దీంతో ఉన్న అతి కొద్ది మందికే ఎక్కువ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సిన పరిస్థితి.
అందుకే.. పలు క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీలు తమ ఉద్యోగులకు గంట వేతనాన్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సంవత్సర వేతనం కోటి రూపాయలు దాటిపోయిందని సమాచారం. ఆస్ట్రేలియాలోని డాక్టర్లు, ఇంజనీర్ల కంటే క్లీనింగ్ పనిచేసే వాళ్లే ఎక్కువ సంపాదిస్తున్నారంట. ఒక్కో క్లీనింగ్ వర్కర్ నెలకు 8లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంట. ఇక వీరి గంట వేతనం మూడు వేల రూపాయలుగా ఉందంట. దీనిపై సిడ్నీలోని ఓ క్లీనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జో వెస్ మాట్లాడుతూ..
‘‘ క్లీనింగ్ ఉద్యోగుల జీతం కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. క్లీనింగ్ చేసే వాళ్లు ఎవరూ లేరు. గత సంవత్సరం నుంచి ఆ కొరత మొదలైంది. కిటికీలు, కాల్వలు క్లీన్ చేయటానికి సంవత్సరానికి దాదాపు 82 లక్షల రూపాయలు చెల్లించాల్సిన వస్తోంది. ఒకప్పుడు బ్రిటన్‌లోనూ ఇదే పరిస్థితి ఉండేది. భూమిలోంచి క్యాబేజీ తీయటానికి అక్కడ సంవత్సరానికి 65లక్షల రూపాయల జీతం ఇచ్చేవారు’’ అని పేర్కొన్నాడు. మరి, సంత్సరానికి దాదాపు కోటి సంపాదిస్తున్న ఆస్ట్రేలియా పారిశుధ్య కార్మికులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Mosquitoe: దొంగను పట్టించిన దోమలు.. తమను చంపిన వాడిపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాయా!