ఒక పక్క దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఓ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ ఆర్థిక మాంద్యానికి ఎదురెళ్లి మరీ నిలబడింది. అక్కడితో ఆగిందా, అబ్బే మాకు లాభాలు వచ్చాయి కాబట్టి మా ఉద్యోగులకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఏవండీ.. ఇప్పుడు బోనస్ అంటే ఏ కంపెనీ అయినా ఎంత ఇస్తుంది? ఒక 5 వేలు, పోనీ 10 వేలు, గరిష్టంగా లక్ష అనుకోండి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీ ఏకంగా ఒక్కో ఉద్యోగికి రూ. 6 కోట్లు ఇచ్చింది. వావ్ ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? ఈ రేంజ్ లో బోనస్ లు ఇచ్చే బాస్ లు ఉంటారా? అని అనిపిస్తుంది కదూ. ఉన్నారు కాబట్టే వార్తల్లోకెక్కారు.
ఈ రేంజ్ లో బోనస్ ఇచ్చిందంటే అది ఏ సాఫ్ట్ వేర్ కంపెనీనో అనుకుంటే పొరపాటే. అది క్రేన్లను తయారుచేసే కంపెనీ. చైనాకు చెందిన హెనాన్ మెయిన్ అనే క్రేన్ల తయారీ సంస్థ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు భారీగా బోనస్ లు ఇచ్చింది. 40 మంది ఉద్యోగులకు 61 మిలియన్ యువాన్లు బోనస్ గా ఇచ్చింది. భారత కరెన్సీ ప్రకారం 73 కోట్లు పైనే ఉంటుంది. ఆ 6 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేయకుండా ఒక ఈవెంట్ నిర్వహించి.. ఆ డబ్బును కట్టలు కట్టలుగా వేదికపై పేర్చి పెట్టారు. ఆ డబ్బును పట్టుకెళ్ళడానికి ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకున్నారు. ఆ డబ్బుని వారి బ్యాగుల్లో నింపుకుని మోసుకెళ్లారు.
కోవిడ్ ప్రభావంతో పలు సంస్థలు గత ఏడాది తీవ్ర నష్టాలను చూస్తే.. హెనాన్ మైన్ మాత్రం భారీ లాభాలను ఆర్జించింది. అందుకే సంస్థ లాభాలకు కారణమైన ఉద్యోగులకు భారీగా బోనస్ ప్రకటించింది. కంపెనీ సేల్స్ విభాగంలో ఉత్తమ పనితీరుని కనబరిచిన ముగ్గురు సేల్స్ మేనేజర్లకు ఒక్కొక్కరికీ 5 మిలియన్ యువాన్లు (రూ. 6 కోట్లు) చొప్పున ఇచ్చింది. 30 మందికి పైగా ఒక్కొక్కరికీ ఒక మిలియన్ యువాన్లు (రూ. 1.20 కోట్లు) చొప్పున ఇచ్చింది. మొత్తం 40 మంది ఉద్యోగులకు 61 మిలియన్ యువాన్లు ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. 2022లో హెనాన్ మైన్ కంపెనీ స్థాపించబడింది. 5,100కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
2021తో పోలిస్తే 2022లో 9.16 బిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 11 వేల 75 కోట్లకు పైనే ఉన్న కంపెనీ సేల్స్ రెవెన్యూ 23 శాతానికి పెరిగింది. మూడేళ్ళుగా ఉద్యోగుల తొలగింపుల ఊసే లేదు ఆ కంపెనీలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చైనా కంపెనీ తమ ఉద్యోగులకు భారీగా బోనస్ ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Rules: Five minutes,How much money you can count correctly is your bonus.💰💰💰
Henan mining machinery company, the year-end bonus payment method for outstanding employees.
The most employees took 42000RMB. pic.twitter.com/QZMPfAiWKm— Sharing travel (@TripInChina) January 18, 2023