సాధారణంగా హెడ్ ఫోన్స్ ను హాయిగా మ్యూజిక్ ఎంజాయి చేయడానికి ఉపయోగిస్తారు. వీటి వాడకం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే హెడ్ ఫోన్స్ అతిగా వినియోగిస్తే ప్రాణానికి ప్రమాదం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటి వాడకం వల్ల ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయంటారు. కానీ అదే హెడ్ ఫోన్స్ బుల్లెట్ నుంచి ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఈఘటన అమెరికాలు చోటుచేసుకుంది.
Enough_Dance_956 అనే పేరుతో ఉన్న రెడ్డిట్ యూజర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతడి వివరాల ప్రకారం.. అమెరికాలోని ఓ ప్రాంతంలో ఓ 18 ఏళ్ల యువకుడు రేజర్ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్ ధరించి తన ఇంట్లో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఓ బుల్లెట్ కిటికి అద్దాన్ని బ్రేక్ చేస్తూ దూసుకొచ్చింది. ఆ యువకుడి తలకు ఉన్న హెడ్ ఫోన్ ను బలంగా తాకింది. ఆ సమయంలో హెడ్ ఫోన్ లేకపోయి ఉంటే సదరు యువకుడు బుల్లెట్ కి బలయ్యేవాడు.
హెడ్‌ఫోన్ ఆ బుల్లెట్‌ను అడ్డుకోవడం చూసి ఆ యువకుడు షాకయ్యాడు. ఒకవేళ ఆ వస్తువు మంచి క్వాలిటీవి కాకపోయి ఉంటే తన ప్రాణాలు పోయేవని ఆ యువకుడు తెలిపాడు. ఈఘటన చూస్తే తనను చంపడానికి ప్రయత్నించారని అర్థం అవుతోందని వివరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత రేజర్ సపోర్ట్ టీమ్ ఆ యువకుడిని కలిసింది. మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నామని ఆ కంపెనీ పోస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితం బ్రెజిల్‌లో కూడా ఇలాంటి ఘటన వైరల్‌గా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.