టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాల్లో సోమవారం వరుస భూకంపాలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. సోమవారం ఉదయం జరిగిన ప్రకృతి విపత్తులో సుమారు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది. అపార్ట్ మెంట్లు, ఆసుపత్రులు ఒక్కటేమిటీ నివాసాలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఇంకా శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
టర్కీలోని భూకంప తీవ్రతకు హతే అంతర్జాతీయ విమానశ్రయంలోని ఉన్నరన్ వే తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఎయిర్ పోర్టులో ఉన్న ఏకైక రన్ వే రెండుగా చీలిపోయింది. రన్ వేకు పగుళ్లు వచ్చాయి. పెద్ద పెద్ద ముక్కలు పైచి లేచి ఉన్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రన్ వే ధ్వంసం కావడంతో ప్రస్తుతం విమాన రాకపోకలను నిలిపివేశారు. భూకంప తీవ్రతకు ఒక్క టర్కీలోనే 5600లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. సిరియా అంతర్యుద్ధం, ఇతర కారణాలతో తలదాచుకున్న టర్కీ, దాని ప్రధాన నగరాలు భూకంపం ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. ఎటు చూసిన హృదయ విదాకర దృశ్యాలే. ఎటు విన్నా ఆర్తనాదాలే.
ఈ భూకంపం టర్కీలో దశాబ్ద కాలంలో సంభవించిన పెను విపత్తుగా ఆ దేశ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. కాగా, మూడు వరుస భూకంపాలతో అతలాకుతలమైన టర్కీకి భారత్ తో సహా పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. సహాయక సామాగ్రితో కూడిన ఓ విమానం భారత్ నుండి టర్కీకి బయలు దేరింది. ఎన్‌డిఆర్ఎఫ్ బలగాలు, వైద్య బృందం, సహాయక బృందాలు, ఔషధాలు, డ్రిల్లింగ్ యంత్రాలు, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ ను పంపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి ఆపదలో ఉన్ననాడు ఆదుకునేవాడే అసలేన స్నేహితుడు అన్న కొటేషన్ తో భారత్ కు టర్కీ కృతజ్ఖతలు తెలిపింది.
Hatay’da havalimanında Deprem sonrası pist bu hale geldi. Allah herkesin yardımcısı olsun inşallah pic.twitter.com/HuNetG5EZh
— Ankara Trafik Radar (@ankara_cevirme) February 6, 2023