సోషల్ మీడియా.. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు. రోజులో చాలా వీడియోలు మీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఈ వీడియోల ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. మీరు రోజులో చూసే వీడియోల్లే కొన్ని ఆనందాన్ని కలిగిస్తే కొన్ని చికాకు పెట్టిస్తాయి. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మీ కళ్లు చెమర్చేలా చేస్తాయి. అలాంటి వీడియో గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ వీడియో చూశాక కచ్చితంగా ఆ బార్బర్ ని పొగడకుండా ఉండలేరు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు లేకపోయినా కూడా వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
ఓ మహిళ క్యాన్సర్ తో పోరాడుతోంది. ఆమె తరచుగా వెళ్లే హెయిర్ డ్రెస్సర్(బార్బర్) దగ్గరకు వెళ్లింది. అతనికి ఆమె మంచి స్నేహపూర్వక బంధం ఉందని ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ సందర్భంగా జుట్టును కత్తిరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె సెలూన్ కి రావడంతో బార్బర్ ఆమె జుట్టును కత్తిరించడం ప్రారంభించాడు. ఆమె జుట్టుని ట్రిమ్ చేస్తున్న సమయంలో ఆ యువతి ఏడవడం ప్రారంభించింది. జుట్టు లేకుండా తన ముఖాన్ని చూసుకుని కన్నీటిపర్యంతమైంది. ఆమెని చూసి బార్బర్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు.
తడిసిన కళ్లతోనే అతను ఆమె జుట్టును కత్తిరించాడు. ట్రిమ్మర్ తో మొత్తం జుట్టుని తీసేసిన తర్వాత ఆమెను హత్తుకుని ఏడ్చాడు. తర్వాత ఆమె వెనక్కు వెళ్లి అద్దంలూ చూసుకుంటూ ట్రిమ్మర్‌తో తన జుట్టుని కూడా కత్తిరించుకోవడం ప్రారంభించాడు. అది చూసి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. కానీ, అతను అలా జుట్టు కత్తిరించుకుని ఆమెకు తన మద్దతును తెలిపాడు. నెట్టింట అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను చాలా గొప్ప మనసున్న వ్యక్తి అంటూ కామెంట్ చేస్తున్నారు.
A cancer patient visits her hairdresser and he does the unexpected 💕pic.twitter.com/VK5EgAoahx
— Kevin W. (@Brink_Thinker) January 16, 2023