పెళ్లిళ్లు అన్న తర్వాత వింత ఘటనలు, విచిత్ర సంఘటనలు జరగటం సర్వసాధారణం. పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటుంది. అలాంటి వీడియోలను చూసి నవ్వు వస్తూ ఉంటుంది.
పెళ్లంటే ఒకప్పుడు ఐదు రోజుల పండుగలాగ జరిగేది. బంధుమిత్రులు, స్నేహితుల హడావిడితో ఎంతో సందడిగా పెళ్లిళ్లు జరిగేవి. తర్వాతి కాలంలో అది మూడురోజులకు పడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రెండు రోజులుల్లో.. ఒక్కరోజులో పెళ్లి చేసేస్తున్నారు. ఇందులో బంధుమిత్రులు, స్నేహితుల హడావిడి ఉండటం లేదు. వెడ్డింగ్ ప్లానర్లతో తూతూ మంత్రంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెడ్డింగ్ ప్లానర్లదే హవా. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో వెడ్డింగ్ ప్లానర్ల ద్వారానే అన్ని పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి వేడుకల్లో చోటుచేసుకునే పిచ్చి పనులు, వింత పనులు వెడ్డింగ్ ప్లానర్లకు తెలియకుండా పోదు.
ఒక్కోసారి ఇవి వారి ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయి. తాజాగా, ఓ వెడ్డింగ్ ప్లానర్ ఓ పెళ్లిలో చోటుచేసుకున్న వింత ఘటనను బయటపెట్టింది. ఓ పెళ్లిలో పెళ్లి కుమారుడు చేసిన వింత పనిని ప్రపంచానికి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌కు చెందిన జార్జీ మిచెల్ అనే మహిళ వెడ్డింగ్ ప్లానర్‌గా పని చేస్తూ ఉంది. అంతేకాదు! ఆమె పోడ్‌కాస్ట్‌లు చేస్తూ ఉంటుంది. ‘బ్రైడ్’ పేరిట నిర్వహించబడుతున్న ఆ పోడ్ కాస్ట్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇక, జార్జీ తాను చేసిన పెళ్లిళ్లలో చోటుచేసుకున్న సంఘటనలతో తన పోడ్‌కాస్ట్‌లను చేస్తూ ఉంటుంది.
తాజాగా, ఓ వింతైన అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చింది. జార్జీ మాట్లాడుతూ.. ‘‘ ఓ పెళ్లిలో జెన్నీ అనే మేకప్ ఆర్టిస్ట్ పెళ్లి కూతురుకు మేకప్ వేసింది. ఆ తర్వాత వధువు రెస్ట్ రూముకు వెళ్లాలని చెప్పింది. రెస్ట్ రూముకు వెళ్లిన పెళ్లి కూతురు అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ తింది. అక్కడ పెళ్లి కుమారుడు తల్లి చనుబాలను తాగుతూ ఉన్నాడు. తనకు కాబోయే వరుడు అలా చేస్తాడని ఆమెకు ముందుగానే తెలియదు కావచ్చు. అసలు అంత వయసులో వరుడి తల్లికి పాలు ఎలా వస్తున్నాయి? అన్న ప్రశ్న తలెత్తింది. ఆమె అలా పాలు రావటానికి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నట్లు ఉంది కాబోలు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లి కూతురు అంత జరిగినా పెళ్లి అపలేదు. అతడ్నే పెళ్లి చేసుకుంది’’ అంటూ నవ్వింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అమ్మ చాటు బిడ్డను ఆ పెళ్లి కూతురు మరో లెవల్‌కు తీసుకెళ్లింది’’.. ‘‘ ఇందులో చెడుగా ఆలోచించడానికి ఏమీ లేదు. కొంతమంది ఎంత పెద్దవాళ్లు అయినా తల్లిపాలు తాగటానికి అలవాటు పడి ఉంటారు’’.. ‘‘ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.