ఐటీ.. చాలా మందికి ఇదో కలల ఉద్యోగం. అందమైన సహోద్యోగులు, ఆకర్షణీయమైన జీతం, ఏసీ గదులు, వీకెండ్ పార్టీలు, విదేశీ టూర్లు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దీని గురుంచి చెప్పడానికి చాలా ఉందనుకోండి. ఈ కారణాలే యువత పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపడానికి కారణం. అందులోనూ.. గూగుల్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువగా భావిస్తారని నానుడి ఉంది. ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారని, ఉద్యోగులకు సకల సదుపాయాలు ఉంటాయని మాటలు వినిపిస్తుంటాయి. అలాంటి గూగుల్ సంస్థ ఉద్యోగులకు కోలుకోలేని షాకిచ్చింది. 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సారీ చెపుతూ ఈ-మెయిల్‌లో సమాచారం అందించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మాంద్యం భయాల కారణంగా టెక్ సంస్థలన్నీ ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. భారీ ప్యాకేజీలు, నిర్వహణ కారణాలు చూపిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎంప్లాయిస్ కు పింక్ స్లిప్పులు ఇస్తుండగా.. తాజాగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఆ లిస్టులో చేరింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న12వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఉద్యోగం నుంచి తొలగించనున్న వారి సంఖ్య ఆల్ఫాబెట్ మొత్తం ఉద్యోగుల్లో 6శాతం ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
కాగా, ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగించేందుకు గూగుల్ గతేడాది ఓ సర్వే కూడా చేసినట్టు సమాచారం. నిజానికి గూగుల్ సంస్థ ఉద్యోగుల తొలగింపు విషయంలో గత కొంతకాలంగా జోరుగానే ప్రచారం సాగింది. ఇప్పుడు అది వాస్తవమయ్యింది. గూగుల్ ప్రత్యర్థి కంపెనీ మైక్రోసాఫ్ట్ 10వేల మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని రోజులకే గూగుల్ ఈ ప్రకటన చేయడం విశేషం. తొలగించనున్న 12 వేల మందిలో రిక్రూట్ మెంట్, కార్పొరేట్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్ సభ్యులు ఎక్కువుగా ఉన్నారు. విధుల నుంచి తొలగించనున్న ఉద్యోగులకు ఇప్పటికే ఈ మెయిల్ పంపినట్లు ఆల్ఫాబెట్ ప్రకటించింది. స్థానిక చట్టాల కారణంగా కొన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమలు ఆలస్యం కావచ్చని తెలిపింది. ఇక కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ట్విట్టర్ ఇప్పటి వరకు 50శాతం ఉద్యోగుల్ని ఇంటికి పంపగా, మైక్రోసాఫ్ట్ 10వేలు, అమెజాన్ 18వేలు, మెటా 11 మంది ఉద్యోగులను తొలగించాయి.
Google just announced to layoff 12,000 ppl, or 6% of its staff. This is the largest-ever job cut in it’s history.
According to the reports, the reductions will cut across all of Alphabet’s units & company’s core business would be more heavily affected. #Google #layoffs pic.twitter.com/Ma023sTcID
— Kamlakant Tripathi (@kkt_tweet) January 20, 2023