Google Maps: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి గూగుల్ మ్యాప్స్ ఓ నిత్యావసరంగా మారింది. డెలివరీ బాయ్స్ అడ్రస్‌ను తెలుసుకోవటానికి గూగుల్ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిజం చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే చాలా మందికి ఉపాది లేదు. గూగుల్ మ్యాప్స్‌లోని ప్రత్యేకమైన ఫ్యీచర్స్ కారణంగా ఏ అడ్రస్‌నైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు. మనకు అవసరమైన ఇంటిని సైతం జూమ్ చేసి చూడొచ్చు. ఫారెన్ కంట్రీస్‌లో ఇలాంటి టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది. వీధులు, వీధుల్లోని ఇళ్లు.. ఇలా అన్నింటిని అందులో చూడొచ్చు. మనకు కావాల్సిన అడ్రస్‌ను మరింత చక్కగా కనుక్కోవచ్చు. అయితే, గూగుల్ మ్యాప్స్ కొన్ని ప్రదేశాలను బ్లర్ చేయటం లేదా సెన్సార్ చేస్తుంది.
వాటిని మిగిలిన వారికి కనిపించకుండా చేస్తుంది. ఇలా అమెరికా, ఓహియోలోని క్లీవ్‌లాండ్‌కు చెందిన ఓ ఇంటిని గూగుల్ మ్యాప్ బ్లర్ చేసింది. అయితే, ఇలా బ్లర్ చేయటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. ఆ ఇంటికి ఒణుకు పుట్టించే కథ ఉంది. ఓ సాధారణ వీధిలో ఉన్న ఆ ఇంట్లో ఒకప్పుడు కరుడు గట్టిన నేరస్తుడు, కామాంధుడు ఏరియల్ క్యాస్ట్రో నివాసం ఉండేవాడు. అతడు ముగ్గురు మహిళల్ని ఇంట్లో బంధించాడు. వారిని ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా 10 సంవత్సరాల పాటు అత్యాచారం చేశాడు. అమాండ బెర్రీ, గీనాడీ జీసస్, మిచెల్లే నైట్ అనే ముగ్గురు మహిళలు అతడి కామదాహానికి అల్లాడిపోయారు.
2013 మే 6న ఓ మహిళ తన ఆరేళ్ల కూతురుతో బయటకు పారిపోయి వచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దర్నీ విడిపించారు. క్యాస్ట్రో దోషిగా తేలటంతో జీవిత ఖైదుతో పాటు 1000 ఏళ్ల కారాగార శిక్షను విధించింది కోర్టు. అంతేకాదు! పెరోల్ అవకాశం కూడా లేకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, క్యాస్ట్రో ఇంటిని 2013లోనే పడగొట్టారు. అయితే, ఆ ఇంటి స్థలాన్ని మాత్రం గూగుల్ మ్యాప్స్ బ్లర్ చేసి ఉంచింది. మరి, ఏరియల్ క్యాస్ట్రో ఇంటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : New York: అమెరికాలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి! విచారంలో బైడెన్!