బంగారు గనిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 27 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డ్ మైనింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 330 అడుగుల లోతులో సొరంగంలో 27 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం సంభవించడంతో ఊపిరాడక ఆ కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది. ఈ ఘటన దక్షిణ పెరూలోని అరేక్విపా ప్రాంతంలో ఉన్న యనక్యూహువా మైనింగ్ కంపెనీలో చోటు చేసుకుంది. ఈ మైనింగ్ కంపెనీలో పని చేస్తున్న 27 మంది కార్మికులు దుర్మరణం చెందారు. 175 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన 27 మంది ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేసేవారని తెలిసింది.
లా ఎస్పెరాంజా 1 గనిలో సొరంగంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల సొరంగంలో అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గనిలో పేలుడు సంభవించిన తర్వాత సమీపంలో ఉన్న చెక్క బ్లాకులకు మంటలు అంటుకున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు గ్రౌండ్ నుంచి 100 మీటర్ల (330 అడుగులు) లోతులో ఉన్నారని తెలిపింది. కార్మికుల మృతితో కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా మైనింగ్ ప్రమాదాలు సంభవించాయి. 2022లో దేశ వ్యాప్తంగా జరిగిన మైనింగ్ ప్రమాదాల్లో 38 మంది మరణించగా.. 2002లో 73 మంది వివిధ మైనింగ్ ప్రమాదాల్లో మరణించారు.
తాజాగా జరిగిన ప్రమాదంలో 27 మంది కార్మికులు మృతి చెందారు. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాల్లో ఒకటిగా నిలిచింది. బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో పేరు టాప్ ప్లేస్ లో ఉంది. అలానే రాగి ఉత్పత్తి చేసే జాబితాలో రెండవ స్థానంలో ఉంది. పెరువియన్ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీడీపీలో 8 శాతం కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా 100 టన్నుల బంగారాన్ని ఆ దేశం వెలికితీస్తుంటుంది. ప్రపంచం ఉత్పత్తి చేసే బంగారంలో 4 శాతం ఈ దేశం నుంచే వస్తుంది. వెండి, రాగి, జింక్ ఉత్పత్తుల్లో పెరూ ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
“It’s been confirmed by the Yanaquihua police station, there are 27 dead,” local prosecutor Giovanni Matos tells local television after fire at gold mine in southern Peru pic.twitter.com/Zm5V8jHEz0
— TRT World Now (@TRTWorldNow) May 7, 2023