గత కొన్ని రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా సైన్యం బాంబులతో విరుచుకపడుతోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులతో సహా అందరూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. అందరూ బంకర్లలోకి వెళ్లాళి అంటూ అధికారులు చేసే హెచ్చరికలు వంటి వార్తలు మనం గత కొన్ని రోజులుగా వింటున్నాం. చివరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా బంకర్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా యుద్ధ సమయంలో అందరి నోట వినిపిస్తున్న మాట.. “బంకర్లు”. అసలు ఏమిటి ఈ బంకర్లు? వాటిని ఎందుకు నిర్మిస్తారు? వాటి ఉపయెగం ఏమిటి? ఇలాంటివి మనదేశంలో ఉన్నాయా? అనే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు చాలామంది మదిలో తలెత్తుతున్నాయి. అయితే వాటి వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ దేశమైన బంకర్ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం యుద్ధాలు, విపత్తుల నుంచి రక్షణ పొందడం కోసం. ఇంక కచ్చితంగా చెప్పాలంటే భూమి లోపల నిర్మించుకునే ఇళ్ల మాదిరి నిర్మాణాలను బంకర్లు అని పిలుస్తారు. వీటిల్లో నలుగురికి సరిపడే స్థాయి నుంచి పదుల సంఖ్యలో ఉండేదుకు వీలుగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో పనికొచ్చే మందులు, నీళ్లు, ఆహారం వంటి వాటిని ముందుగా బంకర్లలో దాచుకుంటారు. అణు బాంబుల దాడిని కూడా తట్టుకునేలా భూమిలో ఏకంగా పది, పదిహేను అంతస్తుల లోతు వరకు ఉండే భారీ బంకర్లు ఉన్నాయి. పలుచోట్ల కొండలు, గుట్టలను తొలిచి బంకర్లు నిర్మించారు. అవి సమీపంలో అణుదాడి జరిగినా తట్టుకునేలా ఉంటాయి.
ఇలాంటి బంకర్లు మ దేశంలోనూ చాలా చోట్ల ఉన్నాయి. దేశం సరిహద్దు రాష్ట్రాల్లో వెంబడి అధిక సంఖ్యలో బంకర్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో మన ఆర్మీతో పాటు సాధారణ జనం బంకర్లు నిర్మించుకుంటారు. మన దేశంలో అత్యవసర పరిస్థితి వస్తే.. రాష్ట్రప తి, ప్రధాని, ఇతర కీలక ప్రముఖులకు రక్షణ కల్పించేలా బంకర్లు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కానీ కచ్చితమై ధ్రువీకరణ లేదు. దేశంలో పాకి స్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే బంకర్లున్నాయి. మన దేశంలో ఇప్పటికే సుమారు 10 వేల బంకర్లను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. మన దేశంలోని బంకర్ల గురించి మరిన్ని వివరాల కొరకు కింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.