ప్రభుత్వాలు ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంటాయి. అన్ని వర్గాల ప్రజలు.. వారి వారి అర్హతను బట్టి వివిధ రకాల లబ్ధి పొందుతుంటారు. అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అనర్హులు కూడా లబ్ధిపొందుతుంటారు. తాజాగా ఓ మహిళ ప్రభుత్వాన్ని మోసం చేసి 15 ఏళ్ల పాటు పింఛన్ పొందింది. చివరకు ఓ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది.
ప్రభుత్వాలు ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంటాయి. అన్ని వర్గాల ప్రజలు.. వారి వారి అర్హతను బట్టి వివిధ రకాల లబ్ధి పొందుతుంటారు. అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అనర్హులు కూడా లబ్ధిపొందుతుంటారు. ఇప్పటికే ఇలాంటి మోసపూరిత ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ ఫించను కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. అలా ఒకటి, రెండు ఏళ్లు కాదు.. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారులను బోల్తా కొట్టించింది. చివరకు ఓ చిన్న తప్పుతో ఆమె అడ్డంగా దొరికిపోయింది. మరి.. ఆ స్టోరీ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటలీలో నివాసం ఉంటున్న ఓ 48 ఏళ్ల మహిళ ప్రభుత్వాన్ని మోసం చేసింది. తాను అంధురాలినంటూ 15 ఏళ్ల క్రితం ఓ వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది. ఆ తరువాత ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పింఛను కోసం దరఖాస్తు చేసుకుంది. వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో ఆమె నిజంగానే అంధురాలని అధికారులు నమ్మారు. అంతేకాక సదరు మహిళకు పింఛను కూడా మంజూరు చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఆమె పింఛన్లు డబ్బులను తీసుకునేది.
అలా దాదాపు 15 ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి పింఛను తీసుకుంది. ఈ పదిహేనేళ్లకు గాను 2,08,000 యూరోలు అంటే మన కరెన్సీలో లో దాదాపు రూ.1.8 కోట్లు పింఛన్ రూపంలో ప్రభుత్వం నుంచి ఆ మహిళ కొల్లగొట్టింది. ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ చిన్న తప్పు ఆమెను పట్టించింది. ఇటీవలే ఆమె ఒక రోజు తన సెల్ ఫోన్‌ను స్క్రోల్ చేయడం, ఫైళ్లపై సంతకాలు పెట్టడాన్ని అధికారులు గమనించారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి.. ప్రశ్నించారు. అయితే తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.
చివరకు ఆమె బండారం బయటపడింది. అంతేకాక ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఆమెపై చట్ట పరమైన చర్యలు చేపట్టారు. అలానే ఆమెకు అంధురాలిగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన డాక్టర్ ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇలా కొంతమంది ప్రభుత్వం సొమ్మును కాజేస్తున్నారు. ఇలాంటి వారి వలన అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందటం లేదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.