ఎయిడ్స్ అంటు వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని ఒక మహానుభావుడు చెప్పాడు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు లైంగిక స్పోర్ట్ లో పాల్గొని ఎయిడ్స్ తెచ్చుకుంటున్నారని.. దీనికి ఆనకట్ట వేయాలని అప్పట్లో కం*డోమ్స్ వాడాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎయిడ్స్ తో పాటు ఇతర లైంగిక వ్యాధులు వస్తున్నాయని కం*డోమ్స్ యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. అలా అని కం*డోమ్స్ వాడేవారంతా చెడ్డవారని కాదు. కొత్తగా పెళ్ళైన జంట..పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలనన్న నమ్మకం ఉన్నప్పుడే.. పిల్లల్ని కనాలని కం*డోమ్స్ వాడుతుంటారు. వెనుక చూపున్న వారికే కాకుండా.. ముందు చూపున్న వారికి కూడా వీటి వల్ల ఉపయోగం ఉంది.
అంతేనా కుటుంబ నియంత్రణ కోసం కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు పెరిగిపోయిన సాంకేతిక విప్లవం కారణంగా లైసెన్స్ లేకపోయినా పెళ్ళికి ముందే భార్యాభర్తల ఆట ఆడేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా భాగస్వామికి తెలియకుండా చేసేసుకుంటున్నారు. రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నప్పుడు బుర్రకి హెల్మెట్ లేకపోయినా గానీ ఆ పనికి మాత్రం హెల్మెట్ ని మర్చిపోవడం లేదు. 20, 30 రూపాయలకి చీప్ గా దొరికేస్తుంది. దీంతో యూత్ అంతా బూతు పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈరోజుల్లో కం*డోమ్స్ కొనుక్కోలేని పేదలు ఎక్కడైనా ఉంటారా? ఎందుకుండరు ఉంటారు. కాకపోతే దాన్ని ఫ్రాన్స్ అనాలి.
అవును ఫ్రాన్స్ లో కం*డోమ్స్ ఫ్రీ. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు ఉచితంగా కం*డోమ్స్ అందించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న శుభ సందర్భంగా కం*డోమ్స్ ని ఫార్మసీల్లో ఉచితంగా అందజేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రోన్ ప్రకటించారు. యువతలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసాధారణమైన ద్రవ్యోల్బణంకారణంగా.. ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో మహిళలు అవాంఛిత గర్భం దాలిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే మహిళలకు ఉచితంగా కం*డోమ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు.
అయితే ఈ ఉచిత సంక్షేమ పథకం కేవలం ఆడవారికి మాత్రమే అని, మగవారికి లేదని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. దేశంలోని అన్ని ఫార్మసీల్లో 18-25 ఏళ్ళు వయసున్న అమ్మాయిలకి, యువతులకు ఉచితంగా కం*డోమ్స్ ఇచ్చే విధానం జనవరి 1 2023 నుంచి అమలవుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నారు. ఇప్పటికే 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళల కోసం ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అబార్షన్ లు చేయించుకునే వారందరికీ ఫ్రాన్స్ ప్రభుత్వం ఉచితంగానే చేయిస్తోంది.
తమ నాయకుడు ఇలా ఉచితంగా డోమ్ లిస్తున్నాడని ఆ దేశ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. సంక్షేమ పథకం అంటే ఇలా ఉండాలి. నువ్వే మా నిజమైన నాయకుడివి అంటూ రాబోయే టర్మ్ లో కూడా అన్ననే గెలిపించేయాలని నిర్ణయించుకున్నారు. ప్రాణాలు పోతాయ్, తప్పులు చేయద్దు అంటే వినరు. తప్పులు చేస్తాం, కానీ ప్రాణాల మీదకి రాకుండా ఏదైనా కవచం ఉండాలని కోరుకునే ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి నాయకులు పుడుతూనే ఉంటారు. పుట్టకుండా ఉండాలంటే ఈ నాయకుడు చెప్పినట్టు డోమ్ పెట్టుకోవాల్సిందే. అదన్నమాట విషయం.
J’ai annoncé hier que les préservatifs seraient gratuits pour tous les 18-25 ans. Cette mesure, vous m’avez demandé de l’étendre aux mineurs. Banco. pic.twitter.com/B7bj0RObA6
— Emmanuel Macron (@EmmanuelMacron) December 9, 2022