భార్యాభర్తల గొడవలు కొన్ని సార్లు సరదాగా.. చాలా సార్లు భయంకరంగా ఉంటాయి. వీరి గొడవల్లోకి మూడో వ్యక్తి వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే.. వీళ్లు ఎంత గొడవపడ్డా తర్వాత మళ్లీ కలిసిపోతారు. తర్వాత కలుగ జేసుకున్న వ్యక్తి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కొన్ని సార్లు భార్యాభర్తల గొడవ కారణంగా పక్కన వాళ్లకు ఇబ్బంది అవుతుంది. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసిన చందాన పరిస్థితి తయారవుతుంది. తాజాగా, ఓ వ్యక్తి భార్యతో గొడవ కారణంగా తన పెంపుడు కొండచిలువను చంపేశాడు. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడా, మియామీ డేడ్ కౌంటీ, కట్లర్ బేకు చెందిన 32 ఏళ్ల కెవిన్ మాయోర్గాకు తన తన భార్య భార్యతో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి.
వీరిద్దరూ దారుణంగా గొడవపడేవారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. వీరి గొడవ కారణంగా వారు ఉండే అపార్ట్‌మెంట్‌లో పెద్ద న్యూసెన్స్‌గా మారింది. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వారు పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకోగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కెవిన్ ఉండే ఫ్లాట్ దగ్గరకు వెళ్లారు. లోపల భార్యాభర్తలు గట్టిగట్టిగా అరుస్తూ గొడవపడుతూ ఉన్నారు. పోలీసుల డోర్ బెల్ కొడితే వారు పట్టించుకోలేదు. డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తర్వాత కెవిన్ భార్య డోరు తీసింది. పోలీసులు రాగానే భార్యాభర్తలు గొడవను ఆపారు.
అప్పుడు కెవిన్ భార్య ఓ షాకింగ్ విషయం చెప్పింది. కెవిన్ తమ పెంపుడు పెట్ బాల్ ఫైథాన్ తల కొరికి చంపాడని తెలిపింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. అతడి నోటికి రక్తం ఉండటం.. పెంపుడు కొండ చిలువ తల తెగి ఉండటం చూసి, ఆమె చెప్పింది నిజమేనని నిర్థారించుకున్నారు. అతడిపై జంతు హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా కెవిన్ నానా రచ్చ చేశాడు. అయినా పోలీసులు అతడ్ని లాక్కు తీసుకెళ్లిపోయారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.