సాధారణంగా వర్షాకాలం ప్రారంభం అయిందంటే చాలు.. చాలా చోట్ల చేపల వానలు కురిశాయి.. 5 కేజీల చేప, 10 కేజీల చేప దొరికిందన్న వార్తలు మనం తరచూ చుస్తూనే ఉంటాం. అలాగే సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్లకు పలు సందర్భాల్లో వింత.. వింత చేపలు వలకు చిక్కడమూ జరిగాయి. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే చేప మాత్రం చాలా అరుదైనది, ప్రత్యేకమైనది. ఇంతకీ ఆ చేప ఎక్కడ చిక్కింది.. దాన్ని రాకాసి చేప అని ఎందుకంటారు.. లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
‘ఓర్ ఫిష్’.. రాకాసి చేప.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే ఓ దేశం భయపడి పోతుంది. ఆ దేశం పేరు చిలీ.. అంతలా భయపడడానికి కారణం సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓర్ ఫిష్ దొరకడమే. ఈ చేప 5 మీటర్లకు పైగా ఉంది. అంటే దాదాపు 16 అడుగులు అన్నమాట. ఓర్ ఫిష్ లు సముద్రపు లోతుల్లో ఉంటాయని, భూమిలోపల కదలికలు వచ్చినప్పుడే ఇవి బయటికి వస్తాయని కొందరు నిపుణులు తెలుపగా.. మరికొందరు వాటి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయాలతో పాటు చనిపోయాక పైకి వస్తాయని అంటున్నారు.
Just a little oarfish 😬 pic.twitter.com/S40Vf6zded
— Critical Cupcake 🌈 ♿ ⚛️ (@CriticalCupcake) July 12, 2022
ఈ రకం చేప బయటికి వస్తే భూకంపాలు వస్తాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇది అపశకునమని దేశానికి మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగా గతంలో జపాన్ లో ఈ రాకాసి చేప కనిపించిందని, ఆ తర్వాతే అక్కడ సునామీ వచ్చిందని కొందరు నెటిజన్స్ తెలిపారు. అయితే ఇప్పుడు చిలీలో కూడా భూకంపం వస్తుందా? అన్న సందేహాలు మెుదలైయ్యాయి.
A Perfect Day for Bananafish?
Here in chile they found not a Bananafish, but a “Pez Remo Gigante”
Giant oarfish (Regalecus glesne) pic.twitter.com/AsvFIXPo6O
— me1.eth (@aristodo1) July 13, 2022
ఈ రకమైన చేప జపాన్ లో కాకుండా ఇంతకు ముందు న్యూజిలాండ్ లో కనిపించిందని బీచ్ కు వెళ్లిన యాత్రికులు అప్పట్లో తెలిపారు. కానీ భూకంపాలు సంభవిస్తాయన్న వాదనను సైన్స్ నిర్ధారించలేదు. ప్రస్తుతం ఓర్ ఫిష్ ని క్రేన్ కు కట్టి వేలాడదీసే వీడియో నెట్టింట వైరల్ అయింది. మరి ఈ రాకాసి చేపపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.