ప్రపంచంలో అతి చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ మహిళ అయినా కూడా ఆమె తెగువు, సమర్ధతపై నమ్మకంతో ప్రధానిగా పట్టం కట్టారు. అతి చిన్న వయసులో గొప్ప పదవీబాధ్యతలు చేపట్టిన సనా మారిన్ డైనమిక్ నాయకురాలిగా మంచి పేరు సంపాదించారు.
దేశంలోని అత్యున్నతమైనది ప్రధాన మంత్రి పదవి. ఒక దేశ ప్రధానిగా ఎన్నిక కావడమంటే సాధారణ విషయం కాదు. అందులో ఓ మహిళను ఎన్నుకోవడమంటే అది చెప్పుకోదగ్గ విషయం. తమ న్యాయకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన వారిని.. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దశకు తీసుకువచ్చే సామర్థ్యం కలిగిన వారిని పీఎం గా ఎన్నుకుంటారు. అయితే అతి చిన్న వయసులోనే దేశంలోని అత్యున్నత పదవి అయిన పీఎం పదవిని చేపట్టిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన విడాకుల విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
సనా మారిన్ ఫిన్లాండ్ లో ప్రధానిగా అతిచిన్న వయస్సులోనే ఎన్నికైయ్యారు. సనా మారిన్ 2019 డిసెంబరులో ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవి చేపట్టే సమయానికి ఆమె వయస్సు 34 సంవత్సరాలు. యంగ్ అండ్ డైనమిక్ ప్రధానిగా పేరు తెచ్చుకుంది. సనా ప్రధానిగా పదవిలోకి వచ్చిన తర్వాత కొవిడ్ సమయంలో దేశంలో ఎన్నో నూతన విధానాలను తీసుకువచ్చారు. ఐరోపా సమాఖ్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మన్ననలు పొందారు. రాజకీయపరంగా ఈమె ప్రజాధనం వ్యయం, పార్టీల్లో పాల్గొనడం వంటి వ్యవహారాలపై విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో సనా మారిన్ రాజీనామా చేశారు. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే వరకు సనా మారిన్ ఫిన్లాండ్ కు ప్రధానిగా కొనసాగుతున్నారు.
సనా మారిన్ వ్యక్తిగత జీవితానికి వస్తే భర్త ప్రముఖ వ్యాపార వేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ మార్కస్ రైకోనెన్. 2020లో సనాకు ఆయనతో వివాహం జరిగింది. వీరి వైవాహిక బంధానికి గుర్తుగా ఒక కూతురు పుట్టింది. సనా మారిన్ తన జీవిత భాగస్వామి నుండి విడాకులు తీసుకోనున్నారు. తన మూడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకబోతున్నారు. ఆమె భర్త మార్కర్ రైకోనెన్ నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్ స్టా లో ప్రకటించారు. ‘మేమిద్దరం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. చిన్నప్పటి నుంచి 19 ఏళ్లుగా కలిసి మెలిసి ఉన్నాం. మా కుమార్తెకు తల్లిదండ్రులుగా, ఒకే కుటుంబంగా బాధ్యతలు నెరవేరుస్తాం’ అని పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన విడాకుల విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.