ప్రమాదాలు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు.. కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అయితే.. మరికొన్ని మనుషులు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు కన్నుమూస్తున్నారు.
బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ సమీపంలో కేశవ్ పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సీజన్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ వాతావరణం బీభత్సంగా మారిపోయింది. ఈ ఘటన మరువక ముందే బంగ్లాదేశ్ రాజధాని ఢాకలో భారీ పేలుడు సంభవించడంతో పద్నాలు మంది అక్కడిక్కడే మృతి చెందగా వందల మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సిద్దిక్ బజార్ లో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పద్నాలు మంది చనిపోయారని.. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. 100 మందికి పైగా గాయపడ్డ వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. భవనంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని.. అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఏడు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో శానిటరీ ఉత్పత్తులను అమ్మే దుకాణంలో ఈ పేలుడు సంభవించిందని అంటు్నారు. అయితే పేలుడు కి కారణం అస్పష్టంగా ఉందని.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇక పేలుడు ధాటికి పక్కనే ఉన్న బ్యాంక్ అద్దాలు పగిలిపోయాయని.. రోడ్డుకు అవతలి వైపు ఉన్న బస్సు కూడా ధ్వంసమైంది తెలిపారు. అయితే సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ప్రత్యేక్ష సాక్షి బారీ మాట్లాడుతూ.. సాయంత్రం సమయంలో రెండు కిలో మీటర్ల వరకు ఒక భారీ శబ్ధం వినిపించిందని అన్నారు. గత సంవత్సరం జూన్ మాసంలో ఇదే ప్రాంతంలో కంటైనర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 50 మంది చనిపోయారు.. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
At least 7 people killed, over 70 people injured in an explosion at a building in Bangladesh’s Dhaka: Local media #Dhaka #Bangladesh #DHAKABLAST pic.twitter.com/hbZLibPTrF
— DHIRAJ DUBEY (@Ddhirajk) March 7, 2023