ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా చాలా మంది వాటికి బానిసలవుతున్నారు. ధూమపానం చేయడం వలన సదరు వ్యక్తి ప్రాణాలతో పాటు వారి కుటుంబలోని సభ్యుల ప్రాణాలను సైతం రిస్క్ లో పడతాయి. ధూమపానం కారణం గా అనేక కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఈ చెడు వ్యసనాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందు మనదేశంతో పాటు అనేక దేశాలు చాలా ప్రయత్నలు చేస్తుంటాయి. ఈక్రమంలో పొగతాగడం మానేస్తే రూ.40 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది ఓ నగరం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. మరి ఆ నగరం ఏమిటో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్మోకింగ్ కి బానిసలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్మోకింగ్ రేటును తగ్గించేందుకు బ్రిటన్‌లోని చెషైర్ ఈస్ట్ అనే నగరం పైలట్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇక్కడ ధూమపానం చేసేవారికి ఓ ఆఫర్ ప్రకటించింది. అది ఏమిటంటే.. స్మోకింగ్ చేసే వారు దానిని పూర్తిగా మానేస్తే, డబ్బు బహుమతి గా ఇవ్వబడుతుంది. చెషైర్ ఈస్ట్ నగరంలో ఈ ఆఫర్ అమలులో ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇక్కడ పొగతాగే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పొగతాగడం మానేసిన వారికి రూ. 20 వేలు, గర్భిణి మానుకుంటే రూ. 40 వేలు ఇస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: ప్రియురాలిపై కోపంతో ప్రియుడు నానా రచ్చ.. 39 కోట్లు నష్టం!
ఈ పథకం వల్ల ప్రజలు కచ్చితంగా మారతారని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ పథకం ప్రకారం.. రూ.20, రూ.40 వేల వార్డును ప్రకటించారు, కానీ దానికి అర్హులు కావాలంటే.. ధూమపానం పూర్తిగా మానేసినట్లు నిరూపించాలి. ఒక వ్యక్తి ధూమపానం మానేసినట్లు చెప్పినప్పుడు.. అతడు లేదా ఆమె పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రజల ధూమపాన వ్యసనాన్ని వదిలించుకోవడానికి 116,500 యూరోలు అంటే భారతీయ కరెన్సీలో 10 మిలియన్లకు పైగా ఆ నగరం తమ బడ్జెట్ లో ఆమోదించింది. ఇందులో నుండి ధూమపానం మానేసినందుకు ప్రతిఫలంగా ప్రజలకు కొంత డబ్బు ఇవ్వబడుతుంది. ఆ నగర కౌన్సిల్ నివేదిక ప్రకారం ధూమపానం మానేయాలనుకునే వారికి ఈ ఆర్థిక సహాయం ప్రయోజనకరంగా ఉంటుంది
ఇదీ చదవండి: 60 రూపాయలకే 11 ఎకరాల భూమిని సొంతం చేసుకున్న కుటుంబం!
కౌన్సిల్ నివేదిక ప్రకారం రోజుకు 20 మంది ధూమపానం చేసేవారు సంవత్సరానికి రూ. 4.4 లక్షలు ఖర్చు చేస్తారంట. ధూమపానం మానేయడం ద్వారా ఆ ఖర్చును నివారించవచ్చని, ఈస్ట్ చెషైర్‌లో ఈ పథకం సరైన ఫలితాలను ఇస్తే, ఇతర నగరాల్లో కూడా ఇది అమలు చేయబడుతుందని అక్కడి అధికారులు తెలిపారు. మరి.. ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.