Errol Musk: తండ్రికి తగ్గా తనయుల్ని చూసుంటారు. వాళ్ళు తండ్రినే మించిపోతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతను తనయుడ్నే మించిపోయాడు. తనయుడి కీర్తిని నిండా ముంచిపోయాడు. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ 76 ఏళ్ల వయసులో సంచలన విషయాన్ని వెల్లడించాడు.
వరుసకు కూతురయ్యే 35 ఏళ్ళ జానా బెజుడెన్ హౌట్ తో సీక్రెట్ గా రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మీడియా ముందు వెల్లడించాడు. ది సన్ అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. అంతేకాదు “ఈ భూమ్మీద ఉన్నందుకు మనం చేయాల్సింది కేవలం పునరుత్పత్తి చేయడమే” అంటూ సూక్తి ఒకటి చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికాలో ఇంజనీర్ గా పని చేస్తున్న ఎరోల్ మస్క్.. అనుకోకుండానే రెండో బిడ్డని కన్నామని వెల్లడించారు. 2019లో (74 ఏళ్ళ వయసులో) బిడ్డ పుట్టిన తర్వాత జానా బెజుడెన్ హౌట్ తోనే కలిసి జీవిస్తున్నట్టు తెలిపాడు. ఎరోల్ మస్క్-బెజుడెన్ హౌట్ లకు ఇలియట్ రష్ అనే ఐదేళ్ల మగ బడుద్దాయి ఉన్నట్టు ఇటీవల ప్రకటించారు. ఎలాన్ మస్క్ తో కలిపి ఎరోల్ మస్క్ కి మొత్తం ఏడుగురు పిల్లలు ఉన్నారు.
ఎరోల్ మస్క్.. మాయే హాల్డెమాన్ ను 1971లో వివాహం చేసుకున్నారు. వీరికి ఎలాన్ మస్క్, కింబల్, టోస్కా అనే ముగ్గురు సంతానం ఉన్నారు. 1979 లో ఎలాన్ మస్క్ తల్లితో విడిపోయిన ఎరోల్ మస్క్.. హేడే బెజుడెన్ హౌట్ ను రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే హేడే బెజుడెన్ హౌట్ కు ‘జానా బెజుడెన్ హౌట్’ అనే 4 సంవత్సరాల పాప ఉంది. ఆ పాపతోనే ఎరోల్ మస్క్ సీక్రెట్ గా కాపురం పెట్టేసి పిల్లల్ని కనేశాడు.
ఈ విషయం తెలిసి ఎలాన్ మస్క్ కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. “సవతి చెల్లెలు అయిన జానా బెజుడెన్ తో నేను ఇలా రిలేషన్ షిప్ లో ఉండడం, పిల్లల్ని కనడం నా పిల్లలకు నచ్చదు. గగుర్పాటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎంతైనా వారి సోదరి కదా” అని ఎరోల్ మస్క్ వెల్లడించాడు. ఎరోల్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనవరాలిని ఆడించాల్సిన వయసులో.. సవతి కూతురితో ఏంటి తాత ఈ పనులు? “కొడుకు ప్రపంచానికి పనికొచ్చే పనిలో బిజీగా ఉంటే, బాబు పిల్లల్ని కనే పనిలో బిజీగా ఉన్నాడు. ఎలాన్ మస్క్ సరికొత్త ఉత్పత్తులను సృష్టిస్తే.. తండ్రి ఇలాంటి ఉత్పత్తులని సృష్టిస్తాడంటూ” నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరి.. ఎరోల్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.