ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ గురించి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఆయన చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి సంబంధించిన వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు అందిపుచ్చుకున్న ఎలాన్ మాస్క్ గతేడాది ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు చేశారు.. వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగించారు. గతంలో తాను కొత్త సీఈవో కోసం వెతుకుతున్నానని తెలిపారు. ఎలాన్ మాస్క్ మరోసారి తన తలతిక్క వ్యవహారాన్ని బయట పెట్టారు. కాకపోతే అది మనిషికి బదులు తన పెంపుడు కుక్కను ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ వేధిగా తెలిపారు.
ఎలాన్ మాస్క్ మొదటి నుంచి వ్యంగ్యమైన ట్వీట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు తెరలేపుతుంటారు. తాజాగా తన పెంపుడు కుక్క ఫోల్కీనే ట్విట్టర్ తాజా సీఈఓ అంటూ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సీఈవో లోగో తో ఉన్న షర్ట్ ధరించి కుర్చీలో కూర్చుని ఉన్న తన పెంపుడు కుక్కను పోస్ట్ చేసిన మాస్క్ ‘ట్విట్టర్ కొత్త సీఈవొ ఓ అద్బుతం’ అంటూ పోస్ట్ చేశాడు. ట్విట్ లో ‘ఇతర వ్యక్తి కంటే చాలా మంచిది’, ‘అతను ఉద్యోగం కోసం పర్ఫెక్ట్’ అంటూ కామెంట్స్ చేశాడు మాస్క్. అయితే గతంలో సీఈవో ల కన్నా తన పెంపుడు కుక్క చాలా బెటర్ అంటూ గత సీఈవొ పరాగ్ అగర్వాల్ కి పరోక్షంగా చురకలు అంటించారని తెలుస్తుంది.
గత ఏడాది 4 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేశారు ఎలాన్ మాస్క్. ఎప్పుడైతే ట్విట్టర్ కొనుగోలు చేశారు.. పెను మార్పులు చేయడం మొదలు పెట్టారు. మొదట సీఈవో పరాగ్ అగర్వాల్ ని తొలగించారు.. ఆ తర్వాత ట్విట్టర్ లీగల్ హెడ్ వియజ గద్దె, సీఎఫ్ఓ నెల్ సెగల్ తో పాటు ముఖ్యమైన హూదాలో ఉన్నవారికి ఉధ్వాసన పలికారు ఎలాన్ మాస్క్. అంతేకాదు ట్విట్టర్ వేధికగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు మాస్క్. వాస్తవానికి పరాగా అగర్వాల్ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నప్పటికీ.. ఎలాన్ మాస్క్ ఏదో ఒకటి ప్రస్తావిస్తూ అతన్ని అవమానిస్తున్నారని పరాగ్ స్నేహితులు వాపోతున్నారు.
గతంలో ట్విట్టర్ ఒప్పందం వ్యవహారంలో పరాగ్ అగర్వాల్, టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ కి మద్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్విట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఎలాన్ మాస్క్ అక్కసు ఈ ట్విట్ తో మరోసారి బయటపడిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ కుభేరుడు అయినప్పటికీ ఎలాన్ మాస్క్ ఇలాంటి ట్విట్ దిగజారుడుతనానికి ప్రతీకగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా మాస్క్ వ్యవహరిస్తున్నారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023