ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇస్తూ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.ఇదే విషయంపై తాజాగా తన ట్విటర్ అకౌంట్‌లోనే ఓ పోస్ట్ చేశారు. అయితే సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం కూడా జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనూ షాక్ ఇస్తూ.. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, దీని కారణంగానే ఈ డీల్ ను హోల్డ్ లో పెడుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే మొత్తం అకౌంట్లలో వీటి సంఖ్య 5 శాతం కంటే తక్కువగానే ఉంటుందని ట్విట్టర్ చెపుతోందని, అయితే ఈ లెక్క తేల్చి అన్ని వివరాలను అందించాలని మస్క్ డిమాండ్ చేశారు. ఈ వివరాలు అందేంత వరకు డీల్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్లు చెప్పారు. ఇక ఇటీవల తాను ఒకవేళ అనుమానాస్పద స్థితిలో మరణించవచ్చు.. కానీ నేను మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి: Elon Mask: నేను చనిపోవచ్చు. వైరల్ అవుతున్న ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ దేశాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖులను రష్యా లక్ష్మంగా చేసుకుని వారిని హత్య చేస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎలన్ మస్క్ ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే రష్యా ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయనను చావు భయం వెంటాడుతోందని పలువురు వ్యాఖ్యానించారు. ఎలన్ మస్క్ ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందపై ఎనెక్కితగ్గడంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.