ప్రపంచంలో ఉన్న అనేక వింతల్లో ఈఫిల్ టవర్ ఒకటి. పారిస్ లో ఉండే ఈ టవర్ ను జీవితంలో ఒక్కసారైన చూడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆకాశాని తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ టవర్ కు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. తాజాగా ఈఫిల్ టవర్ పెరిగింది సమాచారం. మరి ఇప్పటికే ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఈ టవర్ ఇంకా పెరగటం ఏమిటి అనే కదా మీ సందేహం.. అయితే అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాదాపు 130 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈఫిల్ టవర్‌ను ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా పారిస్ లో ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని టెంపరరీగా పెట్టాలని అనుకున్నారు. కానీ, తర్వాత పర్యాటకుల ఆసక్తి చూసి శాశ్వతంగా ఉంచేశారు. ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు అంటే.. దాదాపు 1063 అడుగులు. మరోవైపు టవర్ పైభాగంలో యాంటెనాలను అమర్చి ప్రసారాల కోసం కూడా ఈ టవర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటినాలు మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది. తాజాగా ఓ డిజిటల్ రేడియో యాంటెన్నాను మార్చారు.
హెలికాప్టర్ సహాయంతో టవర్ చివరి భాగంలో కొత్త యాంటెనాను కేవలం 10నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు ఆరు మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరుకుంది. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు ఆరు మీటర్ల అంటే 19.69 అడుగుల పెరిగింది. డిజిటల్ రేడియో యాంటెన్నాను పెట్టడం వల్ల దాని ఎత్తు పెరిగిందని చెప్తున్నారు.మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.