ప్రకృతి విలయం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరు మహిళలు బట్టలు ఉతుకుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు.
కాంగోలో దారుణం సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో అక్కడ 20 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు, చాలా మంది తప్పిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోలోవా గ్రామంలోని నదీతీర ప్రాంతానికి దగ్గర్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు బట్టలు ఉతుకుతుండగా అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయని ఆఫీసర్స్ చెప్పారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.
భారీ వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడి ఉంటాయని అందరూ భావిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఇదే ప్రాంతంలోని బిహంబ్వే గ్రామంలో కొండచరియలు విరిగిపడి సుమారుగా 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. నిరుడు డిసెంబర్లో కాంగో రాజధాని కిన్షాసాను వరద ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తులో వంద మందికి పైగా మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భారీ వర్షాలకు తోడు వరద ప్రవాహం, మట్టి పెళ్లలు విరిగిపడటం లాంటి ప్రకృతి విపత్తులతో కోటి మందికి పైగా జనాభా ఉన్న కిన్షాసా నగరం చిగురుటాకులా వణికింది.
At least 20 people are killed after a landslide in eastern Democratic Republic of Congo pic.twitter.com/LUhtwgYYF7
— TRT World Now (@TRTWorldNow) April 4, 2023