ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం విషాదం నుంచి కోలుకోక ముందే పలు చోట్ల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మద్య పలు దేశాల్లో వరుస భూకంపాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపం వస్తుందో అన్న భయంతో ప్రజాలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది.. కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇక్కడ ఇప్పటికీ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఇండోనేషియా, భారత్, అఫ్గానిస్థాన్ దేశాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది.
ప్రపంచ దేశాలను ఇప్పుడు భూకంపాలు వణికిస్తున్నాయి. భారత్, ఇండోనేషియా, నేపాల్, అప్ఘనిస్తాన్, ఫిలిప్పిన్స్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపాలు వస్తాయో అని ప్రజలు బిక్క బిక్కుమంటున్నారు. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప విషాదం మర్చిపోక ముందే పలు దేశాల్లో వరుస భూకంపాలు వస్తున్నాయి. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0 గా నమోదు అయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం తర్వాత అధికారులు ప్రకంపనల గురించి హెచ్చిరికలు జారీ చేశారు. భూకంప ప్రభావం వల్ల ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఈ హెచ్చిరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిండనోవా ద్వీపంలో మరుగుసన్ మున్సిపాలిటీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం బాగానే జరిగినట్లు తెలుస్తుంది. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రావిన్స్ పర్వత ప్రాంతంలో భూమి 30 సెకన్ల పాటు కంపించింది. కాకపోతే ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సందర్భంగా క్లెమెన్ అనే ఓ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ.. భూ కంపం సంభవించినపుడు నేను ఆఫీస్ లో ఉన్నాను.. ఆ సమయంలో వస్తువులు కదలడంతో భయం వేసి బల్లకింద దూరాను. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత బయటకు వచ్చామని అన్నాడు. గత నేల 16న మస్పేట్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.1 గా నమోదు అయ్యింది.
#earthquake M 6.0 – MINDANAO, PHILIPPINES – 2023-03-07 06:02:32 UTC pic.twitter.com/cRuq9q58QH
— SSGEOS (@ssgeos) March 7, 2023