ప్రపంచ వ్యాప్తంగా గత కొంత కాలంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం వల్ల కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇప్పటికీ అక్కడ పలుమార్లు భూకంపం వస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.
ఈ మద్య పలు దేశాల్లో వరుస భూకంపాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపం వస్తుందో అన్న భయంతో ప్రజాలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది.. కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇక్కడ ఇప్పటికీ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఇండోనేషియా, భారత్, అఫ్గానిస్థాన్ దేశాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
న్యూజిలాండ్ లో భారీ భూకపంపం సంభవించింది. శనివారం న్యూజిలాండ్ దేశం కెర్మాడెక్ దీవుల కేంద్రంగా ఈ భూకంపం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 6.9 గా నమోదు అయినట్లు తెలిపింది. భూమికి 152 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టుగా.. తీవ్రత భూకంప కేంద్రం నుంచి 500 కిలోమీటర్ల మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం తెలియరాలేదు. భూకంప సమయంలో వస్తువులు కదిలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగుతు తీశారు.
ఇటీవల న్యూజిలాండ్ ని వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వరదల నుంచి తేరుకోక ముందే.. వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 15న మధ్యాహ్నం సమయంలో న్యూజిలాండ్ లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం న్యూజిలాండ్ లోని లోయర్ హాట్ కు 78 కిలోమీటర్ల దూరంలో భూకంప ప్రకంపణాలు సంబవించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. ఇప్పటికే న్యూజిలాండ్ ని గాబ్రియేల్ తుఫాను కుదిపేసింది. తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పరిస్థితి దారుణంతా మారడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పుడు భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
6.9 magnitude earthquake strikes Kermadec Islands in New Zealandhttps://t.co/VWIcRbBm1y
— IndiaToday (@IndiaToday) March 4, 2023