ఫిజీ దీవులను మరోసారి వణికించింది భూకంపం. వారం వ్యవధిలో అక్కడ రెండో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు.
గడచిన కొన్నేళ్లలో ప్రకృతి విలయాలు మానవాళికి తీవ్ర నష్టం కలిగించాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వైరస్ బారిన పడి కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టమే గాక లాక్డౌన్లు విధించడంతో కోట్ల రూపాయల్లో ఆర్థిక నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాం. అయితే మరోవైపు భూకంపాలు లాంటి ప్రకృతి విలయాలు కూడా ప్రజల్ని భయపెడుతున్నాయి, ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఆ దేశం, ఈ దేశం అనే తేడాల్లేకుండా ఈమధ్య ప్రతి దేశాన్ని కూడా భూకంపాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం మాటల్లో చెప్పేది కాదు.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలు పెను విషాదమనే చెప్పాలి. ఈ భూకంపాల్లో 50 వేల మంది ప్రాణాలు చనిపోయారు. ఇంకా ఆ విషాదం నుంచి ప్రజలు కోలుకోలేదు. కాగా, దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ఫిజీ దీవుల్లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఫిజీలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఫిజీ దేశ పరిధిలో మొత్తం 300 దీవులున్నాయి. ఇవాళ ఉదయం 10.01 గంటలకు 569 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించింది. వారం రోజుల్లో ఫిజీ దేశంలోని దీవుల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. వరుస భూకంపాలతో ఫిజీ దేశ దీవులు అల్లాడుతున్నాయి. ప్రజలు భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.
Earthquake of magnitude 6.3 strikes Fiji
Read @ANI Story | https://t.co/lILm5GRTtF#BreakingNews #earthquake #Fiji #Fijiearthquake pic.twitter.com/2o8hKdKjvb
— ANI Digital (@ani_digital) April 18, 2023