ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తూర్పు అఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం ఏర్పడింది. నాటి భూకంపంలో 1000కి పైగా మృతి చెందగా, 1500లకు పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ తెలిపింది. కఠ్మండూకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధిటుంగ్ వద్ద భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ ప్రకంపణల వల్ల ఇంట్లో వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని.. ఇక ఆస్తి నష్టం గురించి తమకు పూర్తి సమాచారం లేదని అన్నారు.