ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. తమకు ఇప్పటివరకు 20 మంది మృతి, 300 మందికి గాయాలు అయినట్లు సమాచారం అందిందని సియాంజూర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ సమాచారం మొత్తం ఒక్క ఆస్పత్రి నుంచి వచ్చింది మాత్రమేనట. సియాంజూర్‌లో మొత్తం 4 ఆస్పత్రులు ఉన్నట్లు అధికారి వెల్లడించారు.
ఈ భూకంపం సంభవించిన సియాంజూర్ ప్రాంతం ఇండోనేషియా రాజధాని జకార్తాకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్‌లో భూమి కంపించినట్లు తెలిపారు. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని వాతారవరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ భూకంపంలో జరిగిన నష్టం గురించి అక్కడి జాతీయ విపత్తు అధికారులు వెల్లడించారు. పలు ఇళ్లు, అక్కడి ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ ఒక్కటి ధ్వంసమైనట్లు చెప్పారు. భూకంప వల్ల ఏర్పడిన నష్టం ఎంతో చెప్పాలి అంటే సమయం పడుతుందని వెల్లడించారు. భూమి కంపించిన సమయంలో అందరూ ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కార్యాలయాలు, దుకాణాల నుంచి అందరూ బయటకు వెళ్లిపోయారు. ఈ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
BREAKING: #BNNIndonesia Reports
According to local officials, “nearly 20 people were killed and 300 were injured” in #Indonesia‘s #WestJava 5.6 magnitude #earthquake. pic.twitter.com/jFlNLVssVb
— Gurbaksh Singh Chahal (@gchahal) November 21, 2022
BREAKING 🇮🇩 : Tremors were felt in Indonesia’s capital after the earthquake in West Java
‘Nearly 20’ dead, 300 injured in Indonesia quake: local official #Jakarta #Java #Indonesia #Earthquake https://t.co/Dd6Jl6vHhy pic.twitter.com/Kj3A0JWG3d
— Zaid Ahmd (@realzaidzayn) November 21, 2022
#WATCH : #Earthquake of 5.6 magnitude rocks Indonesia’s #Java #island; 20 dead, over 300 injured#Earthquake #Cianjur #JawaBarat #WestJava #Java #Indonesia #ViralVideo #iNDONESIA #earthquake pic.twitter.com/ort2B0J4NG
— Harish Deshmukh (@DeshmukhHarish9) November 21, 2022