ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏక్షణంలో భూకంపాలు వస్తాయో అన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల భారత్, ఇండోనేషియా, నేపాల్, అప్ఘనిస్తాన్, ఫిలిప్పిన్స్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు రావడం చూస్తూనే ఉన్నాయం. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ఇటీవల పలు దేశాల్లో వరుస భూకంపాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, ఇండోనేషియా, నేపాల్, అప్ఘనిస్తాన్, ఫిలిప్పిన్స్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు రావడం చూస్తూనే ఉన్నాయం. రెండు రోజుల క్రితమే పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5 పాయింట్లుగా నమోదైంది. ఈ భూకంప ధాటికి తొమ్మిది మంది మృతి చెందారు. మరోవైపు ఆఫ్ఘానిస్తాన్, భారత్ లోని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు ఇంటర్నేషనల్ సిస్మలాజికల్ సెంటర్ తెలిపింది. ఇలా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా జపాన్ లో భూకంపం సంభవించింది.
రెండు రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతాల్లో భూకంపం సంభవించింది.. దీని ప్రభావం ఉత్తర భారత్ పై పడింది. ఇక పాకిస్థాన్ లో అయితే ఏకంగా 6.5 తీవ్రతతో భూకంపం బీభత్సం సృష్టించిది. తొమ్మిది మంది కన్నుమూయగా.. 200 మంది వరకు పాక్ అధికారులు తెలిపారు. తాజాగా జపాన్ లో భూకంపం వచ్చింది. జపాన్ లోని ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.. దీని ప్రభావం రిక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదు అయ్యిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ఉదయం పూట రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారుే.
సుమారు 28.2 కిలో మీటర్ల లోతులో భూఅంతర్భాగంలో కదలికలు సంబవించినట్లు అధికారులు తెలిపారు. జపాన్ లో ఇజు ద్వీపం అగ్నిపర్వాతలు ఉన్న ప్రదేశం.. ఈ కారణంతోనే అక్కడ తరుచూ భూకాంపాలు సంభవిస్తుంటాయి. ఉదయం వచ్చిన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవల టర్కీ, సిరియాలో సంభవించిన భయంకర భూకంప కారణంగా 50 వేలకు పైగా మరణాలు.. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఏడాది అతిపెద్ద భూకంపంగా చెప్పొచ్చు.