దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా!..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మం.
అక్కడ అమ్మాయిని నిలబెట్టి ఈ యాడ్ షూటింగ్!!.
క్లారిటీ కోసం మేకింగ్ వీడియో.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఓ అమ్మాయిని నిలబెట్టి యాడ్ షూటింగ్ చేయడం విశేషం. ఈ 33 సెకన్ల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్-లుడ్విక్ ఈ యాడ్‌లో కనిపించింది.
యాడ్ మొదట్లో ఎమిరేట్స్ యూనిఫామ్‌లో ఉన్న నికోల్‌ను క్లోజప్‌లో చూపించారు. ఆమె ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ను ప్రమోట్ చేసే కొన్ని ప్లకార్డులు పట్టుకొని కనిపిస్తుంది. ఆ తర్వాత మెల్లగా కెమెరా దూరం జరుగుతుంటే అసలు ఆమె ఎక్కడ నిల్చున్నదీ తెలుస్తుంది. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ యాడ్ కోసం ఎంత ప్రయాస పడ్డారో మరో వీడియోలో ఎమిరేట్స్ చూపించింది. నికోల్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
828 మీటర్ల ఎత్తుతో భూమిపై అతి ఎత్తయిన భవనంగా బుర్జ్ ఖలీఫాకు పేరుంది. 33 క్షణాలున్న ఆ ప్రకటనలో నటించిన నికోల్ స్మిత్ యోగా గురువు కూడా. కొండలు గుట్టలూ ఎక్కే సాహసమూ ఆమె హాబీల్లో ఒకటి. ప్రకటనలో భాగంగా బిల్డింగ్ కొనంచున నిలబడి ‘‘బ్రిటన్ ‘యాంబర్ లిస్టు’లో యూఏఈని చేర్చినందుకు మేం గాల్లో తేలిపోతున్నాం. ఫ్లై ఎమిరేట్స్, ఫ్లై బెటర్’’ అనే ప్లకార్డులను నికోల్ ప్రదర్శించింది.
ఇది నిజమా? అబద్ధమా? ఫేక్ వీడియోను ఏమైనా పోస్ట్ చేశారా? అని నేరుగా సంస్థకే ట్వీట్లు చేయడం మొదలుపెట్టారట. దీంతో అది ఫేక్ కాదు – నిజమేనని క్లారిటీ ఇచ్చింది ఫ్లై ఎమిరేట్స్ సంస్థ. ఆ ప్రకటనకు సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్ మీకోసం:
Real or fake? A lot of you have asked this question and we’re here to answer it.
Here’s how we made it to the top of the world’s tallest building, the @BurjKhalifa. https://t.co/AGLzMkjDON@EmaarDubai #FlyEmiratesFlyBetter pic.twitter.com/h5TefNQGQe— Emirates Airline (@emirates) August 9, 2021