దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగానే దుబాయ్ ఎంతో రద్దీగా ఉండే దేశం. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది పర్యాటకులు సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ పర్యాటకులను ఆహ్వానించిన మొదటి పర్యాటకప్రాతం దుబాయ్ అని అందరికీ తెలసిందే. ఎడారిలో ఓ అద్భుతమైన నగరాన్ని సృష్టించారు. దుబాయ్ కి టూరిజం నుంచే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అందుకే అక్కడ పర్యాటకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ప్రస్తుతం దుబాయ్ మొత్తం పర్యాటకులతో కిక్కిరిసి పోయింది. ఎటు చూసిన టూరిస్ట్స్ ఉన్నారు. విమానాశ్రయాలు అయితే ఇసుక వేస్తే రాలనంత మంది జనం కనిపిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుుకునేందుకు పర్యాటకులు దుబాయ్ కి క్యూ కడుతున్నారు. అక్కడ వచ్చే వారం రోజులపాటు ప్రతి ప్రాంతం, ప్రతి టూరిస్ట్ స్పాట్ రద్దీగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఇంక విమానాశ్రయాల్లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోజుకు 2,45,000 మంది పర్యాటకులు వస్తున్నట్లు వెల్లడించారు.
New Year 2023 in Dubai 😍 #Dubai #DXB #dubailife #BurjKhalifa #traveltips #NewYear2023 pic.twitter.com/jkV09kkRVJ
— Virat_Gaming (@Virat_Gaming_22) December 29, 2022
అలాగే జనవరి 2వ తారీఖున విమానాశ్రయాల్లో రద్దీ 2,57,000కు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచిస్తున్నారు. అలాగే ఫ్యూచర్ మ్యూజియం, డిసర్ట్ సవారీ, బుర్జ్ ఖలీఫా ఫైర్ షో వంటి వాటికి టికెట్స్ మొత్తం బుక్ అయిపోయినట్లు చెబుతున్నారు. ఫ్యూచర్ మ్యూజియం అయితే జనవరి 12 వరకు టికెట్స్ అందుబాటులో లేవన్నారు. ప్రతి ప్రముఖ హోటల్, రెస్టారెంట్లు కిక్కిరిసిపోయాయి అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం దాదాపు దుబాయ్ రాబోయే వారంపాటు రద్దీగానే ఉంటుందని చెబుతున్నారు.
Ring in the New Year, 2023, with #DubaiOneTv‘s special fireworks coverage from #Dubai and around the world. #NewYear #NYE2023 #UAE @DubaiOneTV pic.twitter.com/Y6MGjNnjK9
— Emirates 24|7 (@Emirates247) December 29, 2022
ప్రపంచంలో ఉన్న ఎంతో మంది ఔత్సాహికులు కొొత్త సంవత్సరాన్ని దుబాయ్ గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పర్యాటకంగా దుబాయ్ కి ఎంతో మంచి పేరుంది. ఇప్పుడు న్యూ ఇయర్ కావడంతో ఆ రద్దీ మరింత పెరిగింది. అక్కడి ప్రభుత్వం కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తుందని తెలిసిందే. ఇప్పటికే భారత్ కు చెందిన ఎంతో మందికి ప్రముఖులకు గోల్డెన్ వీసా ఇచ్చి వారిని వారి దేశానికి ఆహ్వానిస్తున్నారు. దుబాయ్ కి వెళ్లే పర్యాటకుల్లో భారత్, ఒమన్, సౌదీ అరేబియా, యూకే, రష్యా నుంచే ఎక్కువ మంది టూరిస్ట్స్ వెళ్తుంటారు.
Celebration | New Year 2022
Stunning burj e khalifa fire works show up.#HAPPYNEWYEAR2022 #NewYear #Celebrations #UAE #Dubai #BurjKhalifa pic.twitter.com/LL2TR3KZhz— HitmartStore (@tidibitiz) January 2, 2022