కారు వేగంగా వెళుతూ ఉంది. పోలీసులు ఆ కారును వెంబడిస్తూ ఉన్నారు. ఓ చోట కారు ఆగిపోయింది. పోలీసులు ఆ కారు దగ్గరకు వచ్చి చూసి షాక్ అయ్యారు. ఓ కుక్క డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉంది.
తప్పులు చేసి తప్పించుకోవటానికి కొందరు అతి తెలివిని ఉపయోగిస్తున్నారు. ఆ తెలివి తెల్లారి ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తాగి కారు నడిపాడు. పోలీసులు చెకింగ్‌కు రావటంతో తన పెంపుడు కుక్కను డ్రైవింగ్ సీట్‌లో కూర్చోబెట్టాడు. అయితే, పోలీసులు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉన్నాడు. కారు నడుపుతున్న సమయంలో అతడు ఫుళ్లుగా మద్యం సేవించి ఉన్నాడు.
కారును ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ వెళుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతడి కారు వెంట పడ్డారు. పోలీసులు ఫాలో అవుతుండటంతో అతడు తన కారు వేగాన్ని పెంచాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన వెంటనే ఓ చోట కారు ఆపాడు. పోలీసులు ఆ కారు దగ్గరకు వచ్చారు. తర్వాత డ్రైవింగ్ సీటు దగ్గరకు వచ్చి చూశారు. డ్రైవింగ్ సీటులో కుక్క ధీమాగా కూర్చుని ఉండటం చూసి షాక్ అయ్యారు. వెనక సీటులో ఉన్న వ్యక్తిని పరీక్షించి చూడగా.. అతడు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నాడు.
అతడి పేరు అడిగి తెలుసుకున్నారు. అతడిపై ఉన్న కేసుల గురించి ఎంక్వైరీ చేశారు. ఆ వ్యక్తిపై ఇది వరకే 2 కేసులు ఉన్నట్లు తేలింది. అంతేకాదు! అతడు తాగి కారు నడిపాడని, తాము వెంటపడటంతో కుక్కను డ్రైవింగ్ సీటులో పెట్టాడని గుర్తించారు. అతడ్ని కారునుంచి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.