నేటికాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీల్లో డ్రోన్ కూడా ఒకటి . కరోనా సమయంలో డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇవి వీడియో, ఫొటోషూట్స్, వివిధ సరుకుల డెలివరీ చేస్తాయని అందరికి తెలుసు. కానీ ఆ పనులతో పాటు మనుషుల ప్రాణాలనూ కూడా ఈ డ్రోన్స్ కాపాడుతున్నాయి. తాజాగా స్పెయిన్‌లో ఓ లైఫ్‌గార్డ్ డ్రోన్ నీటిలో మునిగిపోతున్న బాలుడి ప్రాణాలు కాపాడింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ బాలుడి ప్రాణాలు పోయాయి అనుకున్నారు. అయితే డ్రోన్ ద్వారా లైప్ గార్డు వెస్ట్ ఆ బాలుడికి అందించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
స్పెయిన్ లోని వాలెన్సియా బీచ్ లో డ్రోన్ ద్వారా నిత్యం సాధారణ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వాలెన్సియా బీచ్ లో డ్రోన్ పైలట్ మిగెల్ ఏంజిల్ పెడ్రెరో తనిఖీలు చేస్తుండగా ఓ బాలుడు కొట్టుకుపోతుండటం గమనించాడు. అది గుర్తించిన పెడ్రెరో వెంటనే డ్రోన్ ద్వారా లైఫ్ గార్డ్ వెస్ట్ ను కిందికి విసిరాడు. అయితే పెద్ద పెద్ద అలల తాకిడికి అది ఆ బాలుడుని చేరడం కష్టమైంది. అయితే కొద్ది ప్రయత్నం తరువాత ఎట్టకేలకు వెస్ట్ ను ఆ బాలుుడు అందుకున్నాడు. దాని సాయంతో కోస్ట్ గార్డు పడవ వచ్చేంత వరకూ బాలుడు ప్రాణాలు నిలుపుకోగలిగాడు.
కొంత సమయానికి బోట్ లో వచ్చిన కోస్ట్ గార్డ్స్ బాలుడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల అనంతరం ఆ బాలుడిని డిశ్చార్జ్ చేశారు. ట్విట్టర్‌లో “అవర్ వరల్డ్”పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
A lifeguard drone saved the life of a 14-year-old boy who was struggling against the tide off a beach in Valencia, Spain. The drone dropped a life vest to the boy to keep him floating while the baywatch boat arrived. @generaldrones #drone #lifeguard #Spain #Valencia pic.twitter.com/UH7IxYuDAT
— Our World (@OurWorl91027476) July 25, 2022