సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడే ఇలా నీరు తాగాలనిపిస్తుంది. కాబట్టి భోజనం సమయంలోనే కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండాలి. బోజనం సమయంలో మాత్రం తక్కువగా నీరు తాగాలి. ఇక భోజనం మరీ స్పైసీగా ఉన్న నీరు తాగాలనిపిస్తుంది కాబట్టి అలా ఉండకుండా ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తినాలి.
సాధారణంగా మన శరీరంలోని జీవక్రియలు సరైన క్రమంలో పనిచేయాలంటే తప్పనిసరిగా మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది. మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు నీటి పైన ఆధారపడి ఉంటాయి. కనుక మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రతిరోజు వీలైనంతగా నీటిని తాగాలని మనకు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి నీటిని తాగే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.