అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషాదం నెలకొంది. ట్రంప్ సతీమణి ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ట్రంప్ కి ఆమె మొదటి భార్య. న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ మరణించినట్లు ఆమె కుటుంబం గురువారం ప్రకటించింది. ఇవానా ట్రంప్ తన మాన్‌హాటన్ ఇంట్లో మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా యాప్‌లో పోస్ట్ చేశారు.
ఇవానా మోడల్ గా కెరీర్ ఆరంభించి టాప్ పొజీషన్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందిన డొనాల్డ్ ట్రంప్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ముగ్గురు సంతానం. ఇక అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న ప్రథమ మహిళల్లో ఇవానా ట్రంప్ ఒక విదేశీయురాలు. అమెరికా అధ్యక్ష ఎన్నిక సమయంలో ఇవానా.. ట్రంప్ వెన్నంటి ఉన్నారు.. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఒక దశంలో డోనాల్డ్ ట్రంప్ ఆ స్థాకియి ఎదగడానికి ఇవానా కూడా ఓ కారణం అంటుంటారు.
ఇక ఇవానా మృతిపై డోనాల్డ్ ట్రంప్ ఎమోషన్ అయ్యారు. ‘ఆమె గొప్ప అందగత్తె.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.. ఆమె అందరికీ స్ఫూర్తికరమైన జీవితాన్ని గడిపింది’ తన పిల్లలు జూనియర్ డొనాల్డ్, ఇవాంకా, ఎరిక్ లో ఉన్నత స్థాకియి చేరుకున్నేలా పెంచిందని అందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని.. అంతేకాదు ఆమె అందరూ గర్వించదగ్గ మహిళ అని ట్వీట్ చేశారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రెటీలు సంతాపాన్న వ్యక్తం చేశారు.
‘SHE WAS AN ICON’: @JudgeJeanine describes Ivana Trump as an ‘incredible woman’ in wake of her passing. pic.twitter.com/fzj7gBFVAw
— Fox News (@FoxNews) July 15, 2022