అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో లోపం వల్ల న్యూ ఓర్లీన్స్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు సమాచారం. మెక్సికో మీదుగా ప్రయాణిస్తున్న తరుణంలో ఇంజిన్ పనిచేయటం ఆగిపోయిందని.. అందుకే అత్యవసరంగా న్యూ ఓర్లిన్స్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు ట్రంప్ సిబ్బంది తెలిసింది. ఈ ఘటన గతవారం జరిగినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని పొలిటికో అనే వార్తా సంస్థ వివరాల ప్రకారం..న్యూ ఓర్లిన్స్‌లో గత శనివారం జరిగిన రిపబ్లికన్ నేషనల్ కమిటీ డోనార్ రిట్రీట్‌కు హాజరై.. తిరిగి ఫ్లోరిడా ఎస్టేట్‌కు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంజిన్ ఆగిపోయింది. న్యూ ఓర్లియన్స్ లేక్ ఫ్రంట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలు దేరి.. సుమారు 120 కిలోమీటర్లు గగనతంలో ప్రయాణించిన తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఒక ఇంజిన్ మెురాయించింది. దీంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని న్యూ ఓర్లీన్స్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు సమాచారం.అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదు. మరి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.