ఈ సృష్టిలోనే ఎంతో పవిత్రమైనది ప్రేమ.. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు.. ఉండదు. అమ్మ ప్రేమకు తారతమ్యాలు, జాతిభేదాలుండవు అని నిరూపించింది ఓ లాబ్రాడర్ డాగ్. ఈ అరుదైన ఘటన చైనాలో చోటుచేసుకుంది.
చైనా జూలో ఒక పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఏమైందో తెలియదు కానీ.. పుట్టినప్పటి నుంచి ఆ పులి పిల్లికూనలను దగ్గరకు రానివ్వడం లేదు.. ఒకవేళ సిబ్బంది తీసుకు వెళ్లినా పాలు ఇవ్వడం లేదు. దీంతో పులి పిల్లలు ఆకలితో ఇబ్బంది పడుతున్నాయిన తెలుసుకొని వాటి ఆలన పాలనా చూసేందుకు అక్కడే ఉన్న లాబ్రాడర్ శునకానికి అప్పజెప్పారు. మొదట ఆ శునకం పులి పిల్లలను మక్కువ చేసుకుంటుందా అని ఆలోచనలో పడ్డారు.. కానీ, ఆ పులి కూనలను అక్కున చేర్చుకొని తల్లిని మరిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరరల్ గా మారింది.
సాధారణంగా పులి పాలిచ్చి పెంచే పరిస్థితిలో లేనపుడు పిల్లలపై దాడి చేస్తుంటాయి.. వాటిని దూరంగా తీసుకు వెళ్లి వదిలి వస్తుంటాయి. ఈ విషయంపై నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ తెలియజేసింది. ప్రస్తుతం లాబ్రాడర్ శునకం తన సొంత పిల్లల్లా పులి పిల్లలను చూసుకోవడం జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదో అద్భుతమైన దృశ్యమని అంటున్నారు. రెండు వేర్వేరు జాతులు.. కానీ ప్రేమ మాత్రం ఒక్కటే అని పేర్కొంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.