మనిషి ఎన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకున్నా కూడా.. విశ్వాసం, తెలివితేటలు, యజమానిపై ప్రేమ విషయంలో మాత్రం కుక్క స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదు. ఆ విషయం చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది కూడా. ఈ వార్త చదివాక అది నిజంగా నిజమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. కారుకు ప్రమాదం జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్న యజమానిని కాపాడి ఈ కుక్క సూపర్ హీరో అయిపోయింది. తక్షణమే పోలీసులను తీసుకొచ్చి యజమాని ప్రాణాలు కాపాడేలా చేసింది జర్మన్ షెపర్డ్ బ్రీడ్ కు చెందిన ‘టిన్స్ లే’. ఇప్పుడు ఈ కుక్క సోషల్ మీడియా సెన్సేషన్.
వాషింగ్టన్ లోని న్యూ హ్యాంప్ షర్ లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రక్కు ప్రమాదవశాత్తు పల్టీలు కొడుతూ నిర్మానుష్య ప్రదేశంలో పడిపోయింది. ఆ కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. వారిలో ఒకరు టిన్స్ లే యజమాని. ఆ కుక్క రోడ్డుపైకి వచ్చి పెట్రోలింగ్ వాహనాన్ని కనుగొని.. పోలీసులను ప్రమాదం జరిగిన చోటుకు తీసుకొచ్చింది. మొదట పోలీసులు ఆ కుక్క తప్పిపోయినట్లు భావించారు. కానీ, ఆ కుక్క ఆగుతూ.. పరిగెడుతూ ఉండటం గమనించారు. అది ఏదో చూపించేందుకు ప్రయత్నిస్తోదని వారు గ్రహించి.. దానిని ఫాలో అయ్యారు.
కారును చూడగానే అత్యవసర సేవలను వినియోగించి ఆ ఇద్దరినీ కాపాడారు. టిన్స్ లే యజమాని మాట్లాడుతూ ‘టిన్స్ లే నా పాలిట ఏంజెల్ డాగ్. అది లేకుంటే నేను ప్రాణాలతో ఉండే వాడిని కాదు. అసలు అలా కూడా చేయచ్చని దానికి ఎలా అర్థమయ్యిందో నాకు ఆశ్చర్యంగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. టిన్స్ లే తన యజమానిని కాపాడి ఆస్పత్రికి పంపే వరకూ అక్కడే అతని పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకొంది. టిన్స్ లేని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేసండి.