సోమవారం టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రకృతి కోపానికి ఆ రెండు దేశాలు అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర భూకంపం ధాటికి వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల్లో 2300 మందికిపైగా మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘోర విపత్తకు సంబంధించిన ఓ విషయం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయో ప్రమాదాన్ని పక్షులు ముందుగానే గుర్తించాయి. భూకంపం రావడానికి కొన్ని క్షణాల ముందు చెట్లపై, భవనాలపై ఉన్న పక్షులు.. రాబోయే ప్రమాదాని పసి గట్టి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.
మూగజీవాలు, పక్షులు ప్రకృతి ప్రకోపం కారణంగా రానున్న ప్రమాదాలను ముందుగానే పసిగడతాయని చాలా మంది నమ్ముతారు. శాస్త్రవేత్తలను మించి రాబోయే ప్రమాదాలను పక్షులు గుర్తిస్తాయని భావిస్తుంటారు. అలాంటి మాటలు కొన్ని సార్లు నిజమేమో అనిపిస్తుంది. టర్కీలు జరిగిన ఓ పక్షుల ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టర్కీలో భూకంప రావడానికి కొన్ని క్షణాల ముందే ఆ ప్రాంతంలోని పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోల్లో సోమవారం తెల్లవారుజామున పక్షులన్నీ భవనాలపై తిరుగుతూ సమీపంలోని చెట్ల పైకి చేరాయి.
భూకంపం సంభవించే క్షణాల ముందు పక్షలు ఇలా వింతగా ప్రవర్తించాయి. పక్షులు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు ముందుగానే ఎగిరిపోతున్నా.. కింద కార్లు, ఇతర వాహనాలు మాత్రం ఎంతో ప్రశాంతంగా రోడ్లపై వెళ్తున్నాయి. సమీపంలోని జనాలు కూడా పక్షులు ఇచ్చిన సంకేతాలను గుర్తించలేకపోయారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ప్రకృతిలో జరుగుతున్న విపత్తులను మూగజీవాలు, పక్షులు ముందుగానే పసిగడతాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదో ఘోరం జరగబోతుందని పక్షులు ముందుగానే గ్రహించాయంటున్నారు. ఇదే వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Nature’s alarm system. We are not sufficiently tuned in to nature to hear it… https://t.co/jzjkQxCxsR
— anand mahindra (@anandmahindra) February 6, 2023
టర్కీ, సిరియా దేశాల చరిత్రలోనే ఇది అతిపెద్ద భూకంపం. విపత్తులకు నిలయమైన ఈ దేశాల్లో నిత్యం అనేక రకాల చిన్న ప్రకృతి విపత్తులు సంభవిస్తునే ఉంటాయి. గడచిన కొంతకాలంలో దాదాపు 322 భూకంపాలు ఆ రెండు దేశాల్లో వచ్చాయంటేనే.. అక్కడ ప్రకృతి తో ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సోమవారం వచ్చిన ఈ భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. అలానే ప్రకృతి విపత్తులను తట్టుకునే ఆ ప్రాంతంలోని భవనాల నిర్మాణం లేదు. ఈ కారణంగానే ఆ దేశాల్లో భారీ ప్రాణ నష్టం జరిగింది.
🚨In Turkey, strange behavior was observed in birds just before the earthquake.👀#Turkey #TurkeyEarthquake #Turkish pic.twitter.com/yPnQRaSCRq
— OsintTV📺 (@OsintTV) February 6, 2023
ఇప్పటికే ఆకలి, ఇతర అంతర్గ సమస్యలతో సతమతమవుతున్న ఈ రెండు దేశాలపై ప్రకృతి కన్నెర చేసింది. దీంతో కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లి.. ప్రపంచ దేశాల సాయం కోసం ఈ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో 2300 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉన్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో, ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైన ఈ భూకంప తీవ్రత భారీ భవనాలు నిమిషాల్లో నేలమట్టం అయ్యాయి.
ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పక్షులు ఆ ప్రాంతంలోని భవనాలపై నుంచి ఎగురుతూ చెట్లపై కి వెళ్లాయి ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. పక్షులు ప్రకృతి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను ముందే పసిగడతాయనే మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.