కోస్టారికాలోని శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం సంభవించింది. ఓ కార్గో విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయిన తర్వాత విమానం కంట్రోల్ అవ్వక రెండు ముక్కలుగా విరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. జర్మన్ ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన బోయింగ్- 757 కార్గో విమానం గురువారం శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. గురువారం ఉదయం శాన్ జోస్ శివారులోని జుయాన్ శాంతామరియా విమానాశ్రం నుంచి డీహెచ్ ఎల్ కు చెందిన బోయింగ్ 737 బయల్దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే మెకానికల్ ఫెయిల్యూర్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఇదీ చదవండి: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం యువకుడి సాహసం.. 50 గంటల్లో 350 కిలోమీటర్లు..
ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం రన్ వే పైనుంచి పక్కకు జారిపోయింది. విమానం వెనుక భాగం విరిగిపోయింది. పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది పొగలను అదుపుచేశారు. విమానంలో ప్రమాద సమయంలో ఉన్న ఇద్దరు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందు జాగ్రత్తగా వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డీహెచ్‌ఎల్ విమానం విరిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
En aeropuerto de Costa Rica, avión de la empresa DHL se parte en 2 tras salirse de la pista, los 2 tripulantes que iban a bordo se reportan estables.#DHL#CostaRica#Accidente#AcustikNoticias pic.twitter.com/Tr600mfA9W
— Acustik Informa (@AcustikInforma) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.