దేవతలు వయసు పెరగకుండా, చావు దరిచేరకుండా నిత్య యవ్వనంగా ఉండేందుకు అమృతం తాగుతారని పురాణాల్లో చెప్పారు. అమృతం తాగడం వల్ల వాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేవారట. అయితే మనుషులకు మాత్రం అలాంటి అమృతం అందుబాటులో లేదు. కానీ, రోజూ వ్యాయమం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కొందరు తమ వయసును పెరగకుండా చూసుకుంటున్నారు. వయసు పైబడకుండా సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అసలు వయసు పెరగకుండా ఉంటాలంటే ఏమైనా వైద్యాలు ఉన్నాయా అంటే టక్కున లేవనే చెబుతుంటారు. ఈ వార్త చదివిన తర్వాత అలాంటి వైద్యాలు కూడా ఉన్నాయని మీరు కూడా ఒప్పుకుంటారు.
అవును.. ఓ వ్యక్తి తన వయసు పెరగకుండా ఓ ట్వీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అది కూడా అలా ఇలా కాదు.. 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించేందుకు తెగ కష్ట పడుతున్నాడు. అయితే అది శారీరకంగా అనుకుంటే మీ పొరపాటే. అతను కోట్లు ఖర్చు చేసి నిత్య యవ్వనంగా కనిపించేందుకు కృషి చేస్తున్నాడు. ఓ 30 మంది వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన శరీరం 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఏడాదికి ఏకంగా రూ.16.3 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నాడు. అయితే అతని ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యాయి. అతని వయసును అతను రివర్స్ చేసుకోగలుగుతున్నాడు.
అతని పేరు బ్రాన్ జాన్సన్ అనే ఓ బయోటెక్ వ్యాపారవేత్త ఈ యాంటీ ఏజింగ్ అనే చాలా ఖరీదైన వైద్యాన్ని పొందుతున్నాడు. అతను అందరిలా రోజులు గడుస్తున్న కొద్దీ పెద్దవాడు కాడు.. పైగా అతని వయసు తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకి అతను 2021 ఏప్రిల్ నెలలో అతని బయోలాజికల్ వయసు 47 సంవత్సరాలు కాగా.. 2021 నవంబర్ నాటికి అతని వయసు 43 సవంత్సరాలకు వచ్చేసింది. అందుకు అతను తీసుకుంటున్న ట్రీట్మెంట్, అతను చేసే వ్యాయామం, అతను తినే ఆహారం ఇలా పూర్తి డేటాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మిగిలిన వారు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ విధానాన్ని అవలంభించేందుకు వీలుగా ఇలా చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
అతని వైద్యానికి సంబంధించిన బ్లూప్రింట్ మొత్తాన్ని నెట్టింట పెట్టేశాడు. అతనికి జరిగిన, జరుగుతున్న వైద్యం గురించి, దాని రిజల్ట్స్ గురించి ఆధారాలతో సహా పంచుకున్నాడు. ఇప్పటికే అతని ఊపిరితిత్తులు, శారీరక ధారుఢ్యం 18 ఏళ్ల కుర్రాడిలా, అతని గుండె 37 సంవత్సరాలుగా, అతని చర్మం 28 ఏళ్ల వ్యక్తిదిలా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇతని డైలీ రొటీన్ ప్రాసెస్ కోసం కాలిఫోర్నియాలోని తన ఇంట్లోనే ఒక సూట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడిని యువకుడిలా కనిపించేలా చేసేందుకు మొత్తం 30 మంది వైద్యులు కృషి చేస్తున్నారంట. అతని మొత్తం అవయవాలు, శరీరం మొత్తం వయసు తగ్గించేందుకు ఆ వైద్యులు తీవ్రంగా కష్టపడుతున్నారంట. ఈ సంవత్సరం ఏకంగా రూ.16.5 కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాడంట.
ఈసారి అతని బ్రెయిన్, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు, పళ్లు, చర్మం, బ్లాడర్, అంగం అన్నీ 18 ఏళ్ల కుర్రాడిలా మారిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అతని హెల్త్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఓ వీడియోలో షేర్ చేసుకున్నాడు. అలాగే అతనికి సంబంధించిన బ్లూప్రింట్ నే విడుదల చేశాడు. ప్రస్తుతం బ్రాన్ జాన్సన్ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఒక మనిషి శరీరాన్ని అలా వెనక్కు తీసుకురావడం జురుగుంతా? నిజంగానే తన వయసును తాను తగ్గించుకోగలడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరీ 45 సంవత్సరాల వ్యక్తి 18 ఏళ్ల యువకుడిలా మారిపోతున్నాడు అని తెలుసుకుని అందరికీ ఆసక్తి కూడా ఎక్కువైంది.