కుటుంబ సభ్యులతో కలిసి బీచ్, నదులు, పర్యాటక కేంద్రాలకు వెళుతున్న వారి పట్ల కొన్ని రౌడీ మూకలు విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నాయి. కొన్నిసార్లు ఈ విహార యాత్రలు.. విషాద యాత్రలుగా మిగులుతున్నాయి. గ్గురు అమ్మాయిలు.. ఎంతో హాయిగా గడిపేందుకు ఓ బీచ్ వద్దకు వెళ్లగా..
పర్యాటక కేంద్రాల్లో సేద తీరేందుకు వెళుతున్న యాత్రికులకు చేదు అనుభవాలు మిగులుతున్నాయి. ఎంతో ఆనందంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బీచ్, నదులు, పర్యాటక కేంద్రాలకు వెళుతున్న వారి పట్ల కొన్ని రౌడీ మూకలు విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నాయి. డబ్బుల కోసం పర్యాటకులను చిత్ర హింసలకు గురి చేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ విహార యాత్రలు.. విషాద యాత్రలుగా మిగులుతున్నాయి. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని.. భవిష్యత్తులపై కోటి ఆశలను పెట్టుకున్న ముగ్గురు అమ్మాయిలు.. ఎంతో హాయిగా గడిపేందుకు ఓ బీచ్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల తర్వాత శవాలై, అత్యంత జుగుప్పాకరమైన రీతిలో ప్రత్యక్షమయ్యారు.
ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఉన్న ఎస్మరాల్డస్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు హింసకు గురై, హత్యగావించబడ్డారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తమకు ఏదో ఆపద జరుగుతుందని ఊహించిన యువతులు.. తన స్నేహితులకు సందేశాలు పంపించారు. తాము డేంజర్‌లో ఉన్నామని, ఏదో జరగబోతోందని చెప్పారు. అంతలోనే వారు అదృశ్యం కావడం, అంతమైపోవడం జరిగింది. ఆ మెసేజ్‌లు పంపిన కాసేపటికే.. దుండగులు ఆ ముగ్గురిని చిత్రహింసలకు గురి చేసి, గొంతు కోసి హతమార్చారు. నదీ ఒడ్డున కొంత గొయ్య తీసి పూడ్చిపెట్టారు. వేటకు వెళ్లిన సమయంలో జాగిలాలు పసిగడట్టంతో వారి మృతదేహాలు వెలుగుచూశాయి.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నయేలీ తపియా( 22), యులియానా మాసియాస్( 21), డెనిస్సీ రేనా (19)గా గుర్తించారు. కాగా, వీరిలో ఒకరు మోడల్, మరొకరు గాయని, మరొకరు విద్యార్థిని అని పోలీసులు పేర్కొన్నారు. వారి బంధువులకు సమాచారం అందించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 4వ తేదీన అద్దె కారులో ఎస్మరాల్డస్ బీచ్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే స్విమ్ సూట్లు ధరించి, బీచ్‌లో ఎంజాయ్ చేశారు. అయితే..వారిని ఎవరో వెంబడిచడం గమనించారు. అప్పుడే తాము డేంజర్‌లో ఉన్నామని గ్రహించిన ఆ యువతులు.. వారి స్నేహితులకు బంధువులకు సందేశాలు పంపారు. నయేలి తన సోదరికి.. ‘ఏదో జరదకూడదని జరగబోతోందని భయంగా ఉంది, అందుకే నీకు మెసేజ్ చేశా’అని సందేశం పంపింది. సోదరి వెంటనే ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. నయేలికి ఆల్రెడీ పెళ్లై, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది.
ప్రాథమిక విచారణ చేపట్టిన క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్లు.. మహిళలకు తగిలిన గాయాల కారణంగా హింసకు గురయ్యారని, వారిని కట్టేసి దాడి చేశారని, గగ్గోలు పెట్టినట్లు కనిపించిందని చెప్పారు. బీచ్ బట్టలు, స్నానపు సూట్లు, తేలికపాటి దుస్తులు, షార్ట్‌లతో మృతదేహాలు కనిపించాయని చెప్పారు. అయితే ఇది మాదక ద్రవ్యాల రవాణా ముఠా పనే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని పోలీసులు తోసిపుచ్చారు. ఇంత వరకు నిందితులెవరో కనుగొనలేదు. ఆ ముగ్గురిలో ఒక యువతి, బీచ్‌కి వెళ్లడానికి ముందు ఒక హోటల్‌లో గడిపిన విషయం తెలిసింది. దీంతో.. క్లూస్ కోసం పోలీసులు సీసీటీవీ రికార్డులు పరిశీలిస్తున్నారు.