ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త కొత్త మొబైల్స్ ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే యాపిల్ ఐఫోన్ కొనాలంటే వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే, దానితోపాటు ఛార్జర్ కచ్చితంగా ఇస్తారు. గతంలో అయితే ఇయర్ ఫోన్స్ కూడా మొబైల్ తో పాటే లభించేవి. తర్వాతి కాలంలో ఐఫోన్ మొబైల్ బాక్స్ నుంచి ఇయర్ ఫోన్స్ మాయమయ్యాయి. ఇలాంటి సమయంలో ఛార్జర్ కూడా ఇవ్వడంలేదని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా సదరు కంపెనీ పట్టించుకోలేదు.
ఈ క్రమంలో బ్రెజిల్ కు చెందిన ఓ వ్యక్తి తాజాగా ఐఫోన్-12 కొన్నాడు. తనకు మొబైల్ తో పాటు ఛార్జర్ రాలేదు. దీంతో న్యాయం కోసం కోర్టు కెక్కాడు. దీనిపై స్థానిక న్యాయస్థానంలో విచారణ జరిపారు. ఈ కేసులో యాపిల్ కంపెనీని కోర్టు తప్పుబట్టింది. స్థానిక వినియోగదారుల చట్టాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందని కోర్టు మండిపడ్డాది.ఫోన్ ఇస్తున్నప్పుడు చార్జర్ లేకుండా ఎలా అమ్ముతారని ప్రశ్నించింది. అలాగే బాధితుడికి స్థానిక కరెన్సీలో 5 వేల రీస్ అంటే మన కరెన్సీలో సుమారు రూ.15 కోట్లు నష్ట పరిహారం యాపిల్ కంపెనీ చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.అయితే పర్యావరణ హితం కోసమే చార్జర్, ఇయర్ ఫోన్స్ వంటి ఉత్పత్తులను ఆ ప్యాకేజీ నుంచి తొలగించామనే కంపెనీ వాదనను కోర్టు తప్పుబట్టింది. నిజంగా పర్యావరణ హితం కోసమైతే అసలు ఆ వస్తువులను ఉత్పత్తి చేయకూడదని, అంతేకానీ ఉత్పత్తి చేసి వేరుగా అమ్మడం వల్ల పర్యావరణానికి ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించింది. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.