Conjoined Twins: సూర్య సినిమా ‘బ్రదర్స్’ చూసిన వారికి కన్‌జాయిన్డ్ ట్విన్స్ గురించి తెలిసే ఉంటుంది. వీరినే తెలుగులో అవిభక్త కవలలు అంటారు. పుట్టుకలో లోపాల కారణంగా ట్విన్స్ ఇలా కలిసిపోయి జన్మిస్తుంటారు. ఇద్దరి శరీరాలు ఏదో ఒక చోట కలిసి ఉంటాయి. అవిభక్త కవలలు ఎక్కువగా తలలు కలిసిపోయి పుడుతుంటారు. తలలు రెండైనా మెదడు ఒకటి మాత్రమే ఉంటుంది.
ఇద్దరినీ విడదీయాలంటే చాలా కష్టతరమైన పని..పైగా ఖర్చుతో కూడుకున్నది. సక్సెస్ రేటు కూడా తక్కువ. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఈ ఆపరేషన్‌కు అంగీకరించరు. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఓ భార్యభర్తల జంట సాహసం చేసింది. తమ బిడ్డల్ని వేరుగా చూడాలని కంకణం కట్టుకుంది. విజయం సాధించింది. వివరాల్లోకి వెళితే..
Surgical teams more than 9,000 kilometres apart have separated conjoined twins whose brains were fused together.
Using virtual reality, they’re celebrating a feat for medical science – and a miracle for a young family. @brett_mcleod #9News pic.twitter.com/TkcWDRijFL
— 9News Melbourne (@9NewsMelb) August 2, 2022
బ్రెజిల్‌కు బెర్నార్డో, ఆర్థర్ లిమాలు అవిభక్త కవలలు. వీరి తల భాగాలు కలిసిపోయి ఉన్నాయి. ప్రస్తుతం వీరి వయసు 3 సంవత్సరాలు. వీరికి ఎలాగైనా ఆపరేషన్ చేయించి వేరుగా చూడాలని తల్లిదండ్రులు భావించారు. అదృష్టం కొద్ది ఆపరేషన్ ఖర్చును డాక్టర్ జిలానీస్ ఛారిటి భరించడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో లండన్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూరోసర్జన్ ఆధ్వర్యంలోని ఓ బృందం నెల రోజుల ముందునుంచే ఆపరేషన్ కోసం సన్నద్ధం అయ్యింది.
ఆపరేషన్ చేసే రోజు రానే వచ్చింది. డాక్టర్లందరూ దాదాపు 27 గంటల పాటు కష్టపడ్డారు. చీఫ్ డాక్టర్ కేవలం 15 నిమిషాల బ్రేక్ తీసుకునే ఈ ఆపరేషన్‌ను చేశాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. బాలలు ఇద్దరూ వేరుపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది. త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Great Ormond Street doctors separate twins joined at head in incredible 27-hour operation #conjoinedtwins #twins https://t.co/gmcxN9Jaec pic.twitter.com/1HsByTJUO7
— Daily Express (@Daily_Express) August 1, 2022
ఇవి కూడా చదవండి : యూట్యూబ్ చూసి సొంతంగా ముక్కు ఆపరేషన్ చేసుకున్నాడు.. చివరకు!