ఏ దేశానికి అయినా ఆపదల నుంచి రక్షించేది ఆదేశ సైన్యమే. రక్షణ వ్యవస్త లేకపోతే దేశంలో ప్రశాంత వాతావరణం ఉండదు. పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే దాడులను, ఉగ్రవాదుల నుంచి వచ్చే ముప్పును అడ్డుకొని దేశ సంపదను, పౌరులను సైన్యమే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. మరి ఇలా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యంపై ప్రతిఒక్కరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజాగా ఓ దేశం తన సైన్యంపై జోకులు వేసి కించపరిచిన ఓ కామెడీ షో కంపెనీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 17.50 కోట్ల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన స్టాండప్ కమెడియన్ లీ హవోషీ, హౌస్ పేరుతో కామేడీ షోలు చేస్తుంటాడు. ఇటీవల జరిగిన ఓ షోలో అతడు కుక్క పిల్లల గురించి మాట్లాడాడు. ఉడతను తరుముతున్న తన కుక్కపిల్లలకు యుద్ధాల్లో గెలిచే సామార్థ్యం ఉందని అన్నాడు. దీంతో అక్కడి స్థానిక సోషల్ మీడియా వీబో లో ఈ ప్రోగ్రాం వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పై బీజింగ్ మునిసిపల్ కల్చరల్ అండ్ టూరిజం బ్యూరో లీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లీ పనిచేస్తున్న సంస్థపై విచారణ చేసింది.
అతడు చేసిన వ్యాఖ్యలు సైన్యాన్ని కించపరిచేలా ఉన్నాయని, చట్టాలను ఉల్లంఘించాడని బీజింగ్ మునిసిపల్ శాఖ వెల్లడించింది. దేశ భద్రతను, ప్రజల ప్రాణాలను రక్షించే పిఎల్ ఎ పై వ్యంగ్యంగా మాట్లాడకూడదని ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కారణాలతో బీజింగ్ మునిసిపల్ కల్చరల్ అండ్ టూరిజం బ్యూరో లీ కంపెనీకి 17.50కోట్ల జరిమానా విధించింది. అయితే సైన్యంపై తను చేసిన వ్యాఖ్యలపై లీ స్పందించాడు. ఆర్మీపై తను చేసిన వ్యాఖ్యలు తప్పేనని లీ హవోషీ ఒప్పుకున్నాడు. కావునా దేశ భద్రతను కాపాడే ఆర్మీని కాని, సైనికులను గాని కించపరిచేలా ప్రవర్తించకూడదని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరైన చర్యే అవుతుందని పలువురు సోషల మీడియా వేదికగా స్పందిస్తున్నారు.