మనిషికి గుండె ఎక్కడుంటుంది అని విద్యార్ధుల్ని మాస్టారు ప్రశ్నిస్తే టక్కున ఎడమ వైపు అని తడుముకోకుండా చెప్పేస్తారు ..ఇది సృష్టిలో వాస్తవంగా అందరికీ తెలుసున్నవిషయం!ఇదొక ప్రశ్నా’..అనిపిస్తుంది.హృదయం ఎక్కడున్నాది..అని ప్రశ్నించినా వారిని అదోలా చూస్తాం.కానీ..అమెరికాకు చెందిన19 ఏళ్ల క్లెయిర్ మాక్‌ని అడిగితే మాత్రం తన గుండె కుడి వైపు ఉందని తడుముకోకుండా చెప్పేస్తుంది.సమాధానం విన్నమనకి ఆశ్చర్యం కలిగించక మానదు.సృష్టికి విరుద్ధంగా ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం!
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని ఓ సినీ కవి అన్నారు.దానిని మనం ‘ఎడమ కుడైతే పొరబాటు లేదోయ్’ అని మార్చి పాడుకోవచ్చేమో!ఓ యువతికి మాత్రం ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉందట.పుట్టిన19 ఏళ్ల తర్వాత ఈ విషయం తెలిసినప్పటినుంచి ఆమె షాక్‌లోనే ఉంది.అమెరికాలోని చికాగోకు చెందిన క్లెయిర్‌మాక్ గత రెండు నెలలుగా దగ్గుతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు.గత నెలలోనే ఆస్పత్రిలో చేరింది.ఆమెను పరీక్షించిన వైద్యుడు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించాడు.
చికిత్సలో భాగంగా ముందుగా ఎక్స్ రే తీయాలని నిర్ణయించారు.అలా తీసిన ఎక్స్‌రే తో గుండె కుడివైపు ఉన్న విషయం బయటపడింది.ఇదే విషయాన్ని క్లెయిర్‌కు చెప్పడం ఆమె విస్మయానికి గురైంది.ఇలా గుండె ఎడమవైపునకు కాకుండా కుడివైపు ఉంటే డెక్స్‌ట్రాకార్డియా అంటారని, ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువ మందిలో ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.ఇదే విషయాన్ని క్లెయిర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
డెక్స్ట్రోకార్డియా అనేది గుండెను ఛాతీకి కుడి వైపుకు చూపించే పరిస్థితి.సాధారణంగా,గుండె ఎడమ వైపు చూపుతుంది. వీరికి పుట్టుకతోనే కుడి వైపే ఉంటుంది.దీనికి కారణాలు ఏమిటంటే గర్భం యొక్క ప్రారంభ వారాలలో,శిశువు యొక్క గుండె అభివృద్ధి చెందుతుంది.కొన్నిసార్లు,అది ఎడమ వైపుకు బదులుగా ఛాతీ యొక్క కుడి వైపున అభివృద్ధి చెందుతుంది.డెక్స్ట్రోకార్డియా అనేక రకాలు.గుండె మరియు ఉదర ప్రాంతం యొక్క ఇతర లోపాలను కలిగి ఉంటాయి. సరళమైన రకం డెక్స్ట్రోకార్డియాలో,గుండె సాధారణ గుండెకు అద్దంలో ప్రతిబింబంలా ఉంటుంది తప్ప ఇతర సమస్యలు ఉండవు.
ఈ పరిస్థితి చాలా అరుదుగా జరుగుతుంది.ఇది సంభవించినప్పుడు,ఉదరం మరియు ఊపిరితిత్తుల అవయవాలు తరచుగా అద్దం లో ప్రతిబింబం మాదిరిగా అమర్చబడతాయి.ఉదాహరణకు,కాలేయం కుడి వైపున కాకుండా ఎడమ వైపున ఉంటుంది.గుండె పనిచేసే తీరులో ఎలాంటి మార్పులు ఉండవు. అందుకే ప్రతివారు తప్పని సరిగా శరీరం మొత్తం స్కానింగ్ అలాగే ఎక్స్ రే లాంటివి తీయించుకుని మన శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అలాగే ఏదైనా లోపాలు ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని,రుగ్మతలకు శస్త్ర చికిత్స అవసరమైతే చేయించుకోవాలి.
ఆరోగ్యం విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన ఆహారం అలవాట్ల ద్వారా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండేలా అందరూ ప్రయత్నం చేయాలి.కనీసం సంవత్సరానికి ఒకసారి శరీర పరీక్షలు చేయించుకోవటం ఒక నియమం గా పెట్టుకోవాలి.తప్పనిసరిగా మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.