సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం అద్దె సేవల గురించి వింటూనే ఉంటాం. ఒక్కమనిషి ప్రాణాలు తప్ప.. ఈ రోజుల్లో ఏ వస్తువులైనా అద్దెకు దొరుకుతాయి. ఇల్లు లేనివారు అద్దింట్లో ఉండి అద్దె చెల్లిస్తారు. మనం ధరించే బట్టలు, నగలు, ఫర్నిచర్, ఇంట్లో పనులు చేయడానికి కూలీలకు కూడా అద్దె చెల్లిస్తాం. అద్దె వందల్లో, వేలల్లో చెల్లించాల్సి ఉంటుంది. కానీ చైనాలో అతి తక్కువ ధరకే అద్దెకు వస్తానంటోంది ఓ అమ్మాయి.. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
చైనాలో ఓ వింత ధోరణి ఉంది. ఇతర వ్యక్తులను అద్దెకు తీసుకునే పద్దతి ఉంది. ఎలా అంటే స్నేహితులు, కుటుంబసభ్యులు, మరే ఇతర అవసరాలకైనా వ్యక్తులు అద్దెకు దొరుకుతారు. అయితే ఓ అమ్మాయి కేవలం రూ.11 కే అద్దెకు వస్తానని ఆఫర్ ఇచ్చింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా రాజధాని బీజింగ్‌లో పెగ్గీ అనే అమ్మాయి ఉంది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. పెగ్గీ ఈ ఏడాది నుంచి ఓ వినూత్నమైన ఆఫర్ అందించేందకు సిద్దమవుతుంది. సాధారణంగా ఎవరికైనా మనుషులు అద్దెకు కావాలంటే కొన్నిసార్లు భారీ వ్యయం అడుగుతుంటారు. కానీ పెగ్గీ మాత్రం తనకు కేవలం 11 రూపాయలు ఇస్తే చాలు ప్రజలు వారిని సంతోషపరిచే కార్యక్రమాలకు వారితో నడుస్తానంటోంది. ఈ విషయాన్ని పెగ్గీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
గతంలో పెగ్గీ వివిధ కంపెనీల్లో రక రకాల ఉద్యోగాలు చేసింది. కానీ ఏ ఉద్యోగంలోనూ తనకు సంతృప్తి దొరకలేదని తెలిపింది. ఈ క్రమంలోనే ఉద్యోగం మానేసి తక్కువ ఛార్జ్‌తో తనను అద్దెకిచ్చే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే తను ఈ పనిలో చాలా అనుభూతిని పొందుతున్నానని చెబుతుంది. డాగ్ వాకింగ్ కు, ట్రెక్కింగ్ లో, పార్క్ ల్లో నడవడానికి అద్దెకు వెళ్ళి వారితో కలిసి తిరగడం చాలా బాగుందని తెలిపింది. చైనాలోని అమ్మాయి ఇచ్చిన ఆఫర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.