తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యతు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలు మనం అనుకున్న స్థాయిలో ఉండరు. మీకు పుట్టబోయే బిడ్డను ఏం చదివించాలి.. డాక్టర్ చేయాలా? యాక్టర్ చేయాలా? లేదా ఇంజనీరింగ్ చేయించాలా? ఇలా మీ ఇష్టమైన విధంగా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను నవమాసాలు మోసి, కని ఇస్తారు. ఇలా చేయడం కోసం తాజాగా చైనాలో పరిశోధనలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
భవిష్యత్తులో నవజాత శిశువు పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం ప్రయోగశాలలో పూర్తవుతుంది. రోబో.. పిల్లలను నర్సులా చూసుకునే కాలం రాబోతోంది. ఈ పనిని చేయడానికి AI అమర్చిన రోబోలు రాబోతున్నాయి. భవిష్యత్తులో శిశువు మానవ గర్భం వెలుపల అభివృద్ధి చెందుతుంది. తల్లి కడుపులో నవమాసాలు గడిపిన పిండంలాగనే ల్యాబ్లో తయారు చేసిన పిండం కృత్రిమ గర్భంలో అభివృద్ధి చెందుతుందని చైనా శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు. చైనాలోని సుజౌ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కృత్రిమ గర్భంలో పెరిగిన శిశువును జాగ్రత్తగా చూసుకునే రోబోను రూపొందించారు.
ఆ దేశ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను జర్నల్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లో ప్రచురించారు. AI రోబో మంత్రసాని పాత్ర పోషించి.. కృత్రిమ పిండానికి సంబంధించిన ప్రతిదీ ఆ రోబో నియంత్రణలో ఉండే విధంగా తయారు చేసినట్లు వెల్లడించారు. పిండం అభివృద్ధి చెందే క్రమంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ AI రోబో శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తుందని.. దీంతో వెంటనే చికిత్స అందించేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
https://t.co/cyKogpKJXm Growing Babies in Robot Wombs: Chinese Scientists Create the “AI Nanny” https://t.co/wQOAd4qixX pic.twitter.com/GrlZE4yB2Q
— Billy Carson II (@4biddnKnowledge) February 2, 2022
ఈ కొత్త విధానంతో ఓ వ్యక్తి తనకు ఎలాంటి బిడ్డ కావాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. వారి అభిరుచులకు అనుగుణంగా పిల్లవాడిని సిద్ధం చేయవచ్చు. అంటే, మీరు పిల్లల్లోని బలాలను ముందే నిర్ణయించవచ్చు. మీకు పుట్టబోయే బిడ్డ ఏం చదువు కోవాలనేది కూడా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి పిండాన్ని తయారు చేసి.. దానిని తొమ్మిది నెలల పాటు మోసి కని.. మీ చేతిలో పెట్టేయవచ్చు అంటున్నారు చైనా పరిశోధకులు. మరి దీనితో కలిగే లాభాలు ఎన్ని ఉన్నా.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని కొందరు శాస్ర్తవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This Artificial Womb And AI Nanny Is The Future Of Child Development, Claim Chinese Scientists #TechnologyTimes – https://t.co/tv21gFNJ7v pic.twitter.com/B2KvAdcJkg
— Technologytimesᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ (@techtimespk) February 1, 2022