దగ్గు సమస్య చిన్నగానే అనిపిస్తుంది కానీ.. దాన్ని అనుభవించే వారికే ఆ బాధ ఎంటో తెలుస్తుంది. దగ్గి దగ్గి కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే దగ్గడం వల్ల పక్కటెముకులు విరిగిన సంఘటన గురించి ఎక్కడైనా విన్నారా. కానీ ఈ వింత సంఘటన తాగాజా వెలుగులోకి వచ్చింది. దగ్గడం వల్ల ఓ యువతికి పక్కటెముకలు విరిగిపోయాయి. అదికూడా ఘాటైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలా తీవ్ర దగ్గు బారిన పడిందంట. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ.. కొన్ని రోజుల క్రితం ఘాటైన ఆహారం తీసుకుందంట. ఆ తర్వాత ఆమెకు తీవ్రమైన దగ్గు వచ్చినట్లు తెలిపింది. మొదట్లో దాన్ని తేలికగా తీసుకుంది. కానీ రాను రాను సమస్య పెరగసాగింది. అలా ఓసారి అలా ఎడతెరపి లేకుండా దగ్గుతున్నప్పుడు ఛాతి నుంచి శబ్దం వినిపించింది.
అయితే సదరు మహిళ తొలుత ఆ శబ్ధాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఛాతిలో నొప్పి పెరగడం ప్రారంభించింది. ఇక తట్టుకోలేక ఆమె వైద్యులను సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు స్కాన్ చేయగా.. ఛాతిలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు తేలింది. దాంతో ఆమెకు బ్యాండేజీలు అవసరమని చెప్పిన వైద్యులు.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే దగ్గడం వల్ల ఇలా పక్కటెముకలు విరగడం ఏంటని.. వైద్యులను ప్రశ్నించగా.. సదరు మహిళ చాలా తక్కువ బరువు ఉందని.. ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఒకటి లేదని.. తెలిపారు.
అందువల్లే.. ఆమె తీవ్రంగా దగ్గినప్పుడు.. పక్కటెముకులు విరిగిపోయినట్లు వెల్లడించారు. వైద్యం ముగిసి.. డిశ్చార్జి అయిన తర్వాత.. ఆమెకు సరైన వ్యాయామం, భోజనం వంటి మార్గాలతో తన కండరాలను బలోపేతం చేసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్లు చెప్పినట్లే చేస్తానని సదరు మహిళ తెలిపింది. ఏది ఏమైనా.. దగ్గడం వల్ల ఇలా ఎముకలు విరగడం.. మాత్రం విచిత్రంగా ఉందని అంటున్నారు జనాలు.