మగాళ్లు ఆడవాళ్లలా డ్రెస్సులు వేసుకుని కెమెరా ముందుకు వస్తున్నారు. లోదుస్తుల్లో కెమెరా ముందు హొయలు పోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చైనా ప్రభుత్వం ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఊహలకందని విషయం. ప్రతీ చిన్న విషయాన్ని తమ దృష్టి కోణం నుంచి చూసే అక్కడి ప్రభుత్వం తప్పుగా అనిపిస్తే దాని మీద నిషేదం విధిస్తుంది. తాజాగా, మహిళా మోడల్స్ లైవ్‌స్ట్రీమ్స్‌లో నటించటాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. అశ్లీల కంటెంట్ ఎక్కువయిపోతోందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో లైవ్‌స్ట్రీమ్ సర్వీసులను నడుపుతున్న సంస్థలు పెద్ద చిక్కుల్లో పడ్డాయి. చేసేదేమీ లేక మగాళ్లను రంగంలోకి దింపాయి. మగాళ్లకు ఆడవాళ్లలా డ్రెస్సులు వేసి కెమెరా ముందు నిల్చోబెడుతున్నాయి. అది కూడా లోదుస్తులు వేసి మరీ వీడియోలు చేయిస్తున్నారు. ఇక, వారు అమ్మాయిల్లా హొయలు పోతూ కెమెరా ముందు నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు చైనాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి.
లేటెస్ట్ టిక్‌టాక్ వర్సెన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు చైనాలోనే కాదు.. ప్రపంచ మొత్తం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక, ఈ వీడియోలపై స్పందిస్తున్న నెటిజెన్లు.. ‘‘ ‘‘ అదే మహిళా మోడళ్లు అయితే.. లైవ్ స్ట్రీమ్‌ను ప్రతీ నిమిషానికి బ్యాన్ చేస్తూ ఉంటారు. ఇదేమీ కొత్తకాదు. ఆడవాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయటానికే ఈ ప్రయత్నం జరుగుతోంది’’.. ‘‘ మగాళ్లు అమ్మాయిలకంటే అందంగా బట్టలు వేసుకున్నారు’’.. ‘‘ ఆడవాళ్లను కమర్సియల్ యాడ్లలో నటించకుండా చేస్తే.. ఇదే జరుగుతుంది’’.. ‘‘ ఇదేం కర్మరా బాబు.. ఈ చైనాలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. రేపు సినిమాలను కూడా బ్యాన్ చేస్తారేమో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, చైనాలో చోటుచేసుకున్న ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.