మనకు ఎలాంటి ప్రమాదం జరగదు.. నష్టం కలగదు అని తెలిసినా సరే.. కష్టంలో ఉన్న తోటి మనిషిని అదుకోవాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తాం. కళ్ల ముందు అన్యాయం జరిగినా.. మనకెందుకులే అని తేలికగా తీసుకుని ముందుకు వెళ్లిపోతాం. కనీస మాట సాయం చేయాడానికి కూడా వెనకాముందు ఆలోచించే సమాజంలో బతుకుతున్నాం. అలాంటి లోకంలో.. తోటి వారి ప్రాణాలు కాపాడటం కోసం.. తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది సైనికులు మాత్రమే. కానీ తోటి వారి కోసం ఇలా తమ ప్రాణాలు త్యాగాలు చేసే వారు ఎవరైనా ఉన్నారా అంటే కచ్చితంగా లేరనే అంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు పూర్తి భిన్నమైనది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడ్డం కోసం.. ఓ రైలు డ్రైవర్ తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తాను చనిపోతూ.. 144 మందికి జీవితాన్ని ప్రసాదించాడు. ప్రస్తుతం అతడి త్యాగాన్ని ప్రశంసిస్తూ.. అశ్రు నివాళి అర్పిస్తున్నారు జనాలు. ఈ విషాదకర సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివారలు..
నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని గుయాంగ్ నుంచి గ్వాంగ్‌జౌకు రెండు క్యారేజ్‌లు ఉన్నబుల్లెట్ రైలు D2809 ప్రయాణం ప్రారంభం అయ్యింది. యాంగ్ ఆ ట్రైన్‌కు డ్రైవర్‌గా ఉన్నాడు. ఇక గుయిజౌలోని రోంగ్‌జియాంగ్ స్టేషన్‌కు సమీపంగా వచ్చే సరికి.. యాంగ్‌కు అక్కడ అసాధారణ పరిస్థితులు కనిపించాయి. రైల్ ట్రాక్ మట్టి, బురదతో కొట్టుకుపోయి ఉంది. ఇది గమనించిన యాంగ్ బ్రేక్ వేసి.. ఐదు సెకన్లలో రైలును ఆపి.. పెను ప్రమాదాన్ని నివారించాడు. తన ప్రాణం పోతుందని తెలిసినా.. రైలును పట్టాలు తప్పించి.. దానిలో ఉన్న 144 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: China: కంపెనీ బంపరాఫర్: పిల్లల్ని కంటే లక్షల్లో బోనస్.. ఏడాది పాటు సెలవులు!
Yang Yong, 46 years old, is the driver of the train #D2809.
In the #accident on June 4, he saved all the people on the train except himself.
Recently, people in his hometown Zunyi, Guizhou, welcomed the #hero back home.
He will be remembered and may he rest in peace. pic.twitter.com/lrECjMA5w7— Voice of the Bund (@VoiceoftheBund) June 7, 2022
ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా రైలు డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో రైలు రోంగ్‌జియాంగ్ స్టేషన్‌కు సమీపంలో సొరంగంలో ఉన్నప్పుడు ట్రాక్‌పై అసాధారణతను గుర్తించిన డ్రైవర్ యాంగ్ అత్యవసర బ్రేక్‌లను లాగాడు. దాంతో రైలు పట్టాలు తప్పింది. అలా 900 మీటర్ల పాటు రాళ్లు, మట్టిని ఢీకొని.. ఆ తర్వాత ఆగిపోయింది. ఫలితంగా డ్రైవర్ యాంగ్ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినవారు.. అతడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. నివాళులర్పిస్తున్నారు. తన ప్రాణం త్యాగం చేసి.. ప్రయాణికులను కాపాడిన యాంగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.
ఇది కూడా చదవండి: భార్య మీద అలిగిన భర్త.. 14 ఏళ్లుగా ఎయిపోర్టులోనే..
Two carriages of the train #D2809 from Guiyang to Guangzhou run off the railway that were hit by mud and rockslide.
The train driver died, and the injured people include one train attendant and seven passengers. 136 other passengers have been safely evacuated.#China #Railway pic.twitter.com/SrGFYStTxd
— Peking Ensight | 🧐 (@PekingEnsight) June 4, 2022
యాంగ్ ఒక అనుభవజ్ఞుడైన సైనికుడు. అతను 1993 నుంచి1996 వరకు పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (పీఏపీ) హైనాన్ కార్ప్స్‌లో పనిచేశాడు. అక్కడ అతను స్క్వాడ్ లీడర్‌గా పని చేశాడు.. అంతేకాక అత్యుత్తమ సైనికుడిగా గుర్తింపు పొందాడు. ఇక పదవీ విరమణ చేసిన తర్వాత, యాంగ్ కో-డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఫోర్‌మెన్, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్, గ్రౌండ్ డ్రైవర్, రైలు డ్రైవర్ ఉద్యోగాలను చేపట్టాడు. ఈ క్రమంలో చైనా నెటిజనులు యాంగ్‌ను దేవుడిగా కోలుస్తూ.. సోషల్ మీడియా వేదికగా అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రాణత్యాగం చేసిన యాంగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అగ్ర కుబేరులు మస్క్- జెఫ్ బెజోస్ మధ్య ట్విట్టర్ యుద్ధం!